ఆ మధ్య కాలంలో హైదరాబాద్ కేంద్రంగా భారీ డ్రగ్స్ ర్యాకెట్ పెను సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే.డ్రగ్స్ ర్యాకెట్ అంతా టాలీవుడ్ ఇండస్ట్రీ చుట్టూ తిరిగి అందులో ప్రముఖుల పేర్లు కూడా బయటకి వచ్చాయి.
ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ రాకెట్ ని సంబంధించి ఆసక్తికరమైన విషయాలని అప్పుడు అధికారులు బయటకి తీసారు.ఇదిలా వుంటే మరల హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ కలకలం సృష్టించింది.
విద్యార్ధులు, యువత టార్గెట్ గా మహిళా గ్యాంగ్ తో ఈ డ్రగ్స్ రాకెట్ ని నడుపుతున్నారని గుర్తించిన పోలీసులు, కాలేజీ పరిసరలలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళని అరెస్ట్ చేసారు.
ఘనా దేశానికి చెందిన మహిళా విద్యార్ధులని టార్గెట్ చేసుకొని కొకైన్ ని విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు.
దీంతో ఆమెని అదుపులోకి తీసుకొని ఆ డ్రగ్స్ రాకెట్ లో ఇంకా ఎవరైనా వున్నారా అనే విషయాలపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.ఇక డ్రగ్స్ ముఠాలో ఎవరెవరు వున్నారనే విషయాలని అధికారులు తెలుసుకునే ప్రయత్నంలో వున్నారు.
ఇక ఈ ముఠా చేస్తున్న డ్రగ్స్ రాకెట్ లో ఎవరిని టార్గెట్ చేసారు.ఎంత మంది డ్రగ్స్ కి బానిస అయ్యారు అనే విషయాలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు.