రైలులో ప్రయాణించేప్పుడు మనకు రకరకాల అసౌకర్యాలు కలుగుతాయి.లైట్ వెలిగితే,ఫ్యాన్ తిరగదు.
ఫ్యాన్ తిరిగితే లైట్ వెలగదు.బాత్రూంలు నీట్ గా ఉండవ్,వాటర్ రావు.
వాటితో పాటు ట్రెయిన్లో అమ్మడానికి వచ్చేవారు ప్రొడక్ట్ ఎమ్ఆర్ పీ కాకుండా అతి వసూల్లు.ఇలా ఎన్నో సమస్యలు.
అయినా మనకెందుకులే అని ఊరుకుంటాం.సర్దుకుపోతాం.
కాని ఒక వ్యక్తి సర్దుకుపోలేదు.రైలు ప్రయాణంలో ఎలుక కరిచిందానికి ఊరుకోలేదు.ముక్కుపిండి రైల్వేవారి నుండి ముప్పై వేలు వసూలు చేశాడు…

సేలం నగరానికి చెందిన వెంకటాచలం 2014లో ఆగస్టు 8వతేదీన చెన్నై నగరానికి రైలులో ప్రయాణిస్తున్నాడు.అప్పుడు కాలికి ఏదో కరిచినట్టుగా అనిపించింది.కాసేపటిక ఏం కరిచిందో అర్దం కాక తను భ్రమ పడ్డాడేమో అనుకుని మళ్లీ పడుకున్నాడు.ఈ సారి నిద్రలోకి జారుకున్న అతనికి కాసేపటికి కాలునొప్పి అనిపించి,మెలకువచ్చింది.తీరా లేచి చూస్తే కాలి నుంచి రక్తం కారుతుంది.పక్కనే ఎలుక ఉంది.
ఎలుక కరవడం వలనే గాయం అయిందని గుర్తించాడు.వెంటనే టిటిఇకి ఫిర్యాదు చేసాడు,కాని టిటిఇ ప్రథమ చికిత్స కూడా చేయకుండా,కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు.
దీంతో వెంకటాచలం ఎగ్మోర్ రైల్వేస్టేషనులో దిగి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకొని, అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో చేరాడు.

టిటిఇ ప్రవర్తనకు కోపం వచ్చిన వెంకటాచలం, రైల్లో ఎలుక కరవడం వల్ల తాను మానసికంగా బాధపడ్డానని తనకు నష్టపరిహారం ఇప్పించాలని వెంకటాచలం వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు.ఈ కేసును విచారించిన ఫోరం అధ్యక్షుడు ఆర్వీ దీన్ దయాళన్ బాధితుడైన వెంకటాచలంకు రూ.25వేల నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద రూ.5వేలు, చికిత్స కోసం రెండు వేల రూపాయలు,మొత్తం 32వేల రూపాయలు చెల్లించాలని రైల్వేశాఖను ఆదేశించింది.వెంకటాచలంను ఎలుక కొరికి నాలుగేళ్లయింది.
నాలుగేళ్ల తర్వాత రైల్వే వారికి ఈ శిక్ష విధించడం గమనార్హం…
.