ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది.సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపోయాడుతుండడంతో అన్ని పార్టీల్లో ఒకటే కంగారు కనిపిస్తోంది.
ఎక్కడ లేని హామీలు గుప్పిస్తున్నారు.ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల్లో ముక్కోణపు పోటీ తీవ్రంగా ఉండే ఛాన్స్ కనిపిస్తుండడంతో అన్ని పార్టీలు కంగారు పడి మరీ పార్టీ నాయకులను కంగారు పెట్టిస్తున్నాయి.అయితే కొత్తగా ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్న జనసేన పార్టీలో మాత్రం కొద్దీ రోజులు హడావుడి కనిపించించినా ఇప్పుడు ఆ ఊపు కనిపించడంలేదు.

మూడు నెలలల్ క్రితం జనాల్లో తిరగడం ప్రారంభించిన పవన్ ఇప్పటికే అనేక అనేక బ్రేకులు తీసుకుంటూ తన పోరాట యాత్రను కొనసాగిస్తున్నాడు.ఏపీ మొత్తం యాత్ర చేస్తానని యాత్ర ప్రారభించారు.కానీ ఇప్పటికి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు మాత్రమే పూర్తిగా కంప్లీట్ అయ్యాయి.యాభై రోజుల షెడ్యూల్‌లో.ఉత్తరాంధ్రను కంప్లీట్ చేశారు కానీ.వాస్తవంగా ఆయన నియోజకవర్గాల్లో పోరాటాలు చేసింది పదిహేను రోజులు మాత్రమే.
రోజుకు రెండు నియోజకవర్గాలు ఒక్కో రోజు మూడు నియోజకవర్గాలు కంప్లీట్ చేశారు.మధ్యలో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, జ్వరాలు పండుగులతో కాలం గడిచిపోయింది.
ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర ప్రారంభించారు.అక్కడ రెండు సార్లు అర్థంతరంగా ముగిసింది.
ప్రస్తుతం జనసేనాని రెస్ట్ లో ఉన్నారు.
ఒక పక్క చూస్తే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.
వచ్చే ఏప్రిల్, మేలో ఎన్నికలు జగనున్నాయి.ప్రస్తుతం పవన్ కల్యాణ్ వేగాన్ని బట్టి చూస్తే.
మూడు నెలలకు మూడు జిల్లాలు మాత్రమే కంప్లీట్ అవుతున్నాయి.ఇంకా పది జిల్లాలు మిగిలి ఉన్నాయి.
వాటిని పూర్తి చేసే సరికి సమయం సరిపోయేలా కనిపించడంలేదు.ప్రస్తుతం పవన్
కంటికి శస్త్ర చికిత్స జరిగింది.
ఐదారు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహాలిచ్చారు.ఆ సమయం కూడా ముగిసింది.
కానీ పవన్ నుంచి మాత్రం యాత్ర కు సంబంధించి ఏ విధమైన సమాచారం బయటకి రావడంలేదు.

ఏపీలోనే జనసేన పరిస్థితి ఇలా ఉంది అంటే పవన్ తెలంగాణా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టడంతో పాటు అక్కడ కూడా యాత్ర చేస్తానని ప్రకటించారు.దీంతో అందరిలోనూ అయోమయం నెలకొంది.ఇంత తక్కువ సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎలా మేనేజ్ చేస్తారో తెలియడంలేదు.
మరో పక్క జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వెళ్లబోతోందో ఇంకా స్పష్టత అయితే రాలేదు.ఇన్ని స్పష్టతలేని ప్రశ్నల మధ్య పవన్ ఎలా నెట్టుకొస్తాడో చూడాలి.