మంగళ వారం ఈ పనులు చేస్తే ఏమి అవుతుందో తెలుసా?

ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మంచి రోజు చూసుకొని పనులను ప్రారంభిస్తాం.అలాగే చేసే పని విజయవంతం కావాలని కోరుకుంటారు .

 Mangalavaram Ee Panulanu Cheste Emi Avutundi, Tuseday , Anyanaya Swami , Pooja,-TeluguStop.com

అందువల్ల ఎవరు ఏ పనిని అయినా మంగళవారం ప్రారంభించటానికి ఇష్టపడరు.అయితే మంగళవారం కొన్ని పనులను చేయకూడదని మన పెద్దవారు చాలా గట్టిగా చెప్పుతూ ఉంటారు.

వాటిని కొంత మంది పాటిస్తారు.అలాగే కొంతమంది తేలికగా తీసుకుంటారు.

అయితే ఇప్పుడు మంగళవారం ఏ పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం.

తలస్నానము చేసే విషయంలో ఆడవారికి కొన్ని రోజులు ప్రత్యేకంగా ఉంటాయి.

 మగవారికి  అలా ఉండవని చాలా మంది అనుకుంటూ ఉంటారు.అయితే ఆడవారైనా మగవారైనా మంగళవారం తలస్నానము చేస్తే మంచిది కాదట.

అలా చేస్తే అశుభ ఫలితాలు రావటమే కాకుండా ఆ రోజు మంచి జరగదట.

మంగళవారం కుజుడికి సంకేతం కాబట్టి ఆ రోజు చేసే పనులను బాగా ఆలోచించి చేయాలి.

ఎందుకంటే కుజుడి ప్రభావం ప్రతి మనిషి మీద ఉంటుంది.కుజుడి ప్రభావం ఉంటే అన్ని కలహాలే వస్తాయి.

అందుకే మంగళవారం ఏమి చేసిన కాస్త ఆలోచించి చేయటం మంచిది.

-Latest News - Telugu

మంగళవారం గోళ్లు కత్తిరించకూడదు.అలాగే హెయిర్ కటింగ్ కి కూడా వెళ్ళకూడదు.అంతేకాక ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావటం కష్టం.

అలాగే ఎవరి దగ్గరి నుంచి అయినా అప్పు తీసుకుంటే ఆ డబ్బు అనవసర ఖర్చులకు ఖర్చు అయ్యిపోతుంది.

మంగళవారం ఆంజనేయుని పూజించటం వలన కుజుడి కారణంగా వచ్చే సమస్యలు అన్ని తొలగిపోతాయి.

మంగళవారం ఎర్రని పువ్వులతో ఎర్రటి బట్టలను కట్టుకొని తమకు  ఇష్ట దైవాన్ని పూజిస్తే అపాయాలు తొలగిపోతాయి.అయితే జాతకంలో కుజ దోషం ఉన్నవారు మాత్రం ఎరుపు రంగు దుస్తులను ధరించకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube