వేసవి కాలం వచ్చేసింది.వేసవి కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్యల్లో చెమటకాయల సమస్య ఒకటి.
వీటి కారణంగా చర్మం దురద పెట్టటమే కాకుండా చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది.కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా చెమటకాయల నుండి బయట పడవచ్చు.
ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.
కలబంద
చెమటకాయలు ఉన్న ప్రదేశంలో కొంచెం కలబంద గుజ్జు రాస్తే త్వరగా తగ్గిపోతాయి.
కలబందలో ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉండుట వలన చెమటకాయలు త్వరగా తగ్గటానికి సహాయపడతాయి.అంతేకాకుండా చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది.
టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి .కొంచెం టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని దానికి కొంచెం నీటిని కలిపి మిశ్రమంగా తయారు చేయాలి.ఆ మిశ్రమంలో కాటన్ బాల్‌ను ముంచి చర్మంపై రాస్తే చెమట కాయలు చాలా త్వరగా తగ్గిపోతాయి.
వెనిగర్
వెనిగర్‌లో ఉండే అసిటిక్ యాసిడ్‌కు చర్మాన్ని సంరక్షించే లక్షణాలు ఉండుట వలన చెమటకాయలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.టిష్యూ పేపర్‌ను తీసుకుని వెనిగర్‌లో ముంచి చెమట కాయలు ఉన్న ప్రదేశంలో అద్దాలి.ఇలా చేస్తే చెమట కాయలు త్వరగా తగ్గిపోతాయి.
లవంగ నూనె
లవంగ నూనెలో చర్మాన్ని సంరక్షించే ఎన్నో లక్షణాలు ఉన్నాయి.కాటన్ బాల్‌ను తీసుకుని లవంగ నూనెలో ముంచి చెమటకాయలు ఉన్న ప్రదేశంలో రాస్తే చెమట కాయలు తగ్గుముఖం పడతాయి.
తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.