ఏపీలో రాజకీయ సమీకరనాలు రోజు రోజుకి ఊపందుకుంటున్నాయి.ఒక పక్క టిడిపి అధినేత కేంద్రంతో డీ అంటే డీ అంటుంటే మరో పక్క బీజేపి కూడా చంద్రబాబుతో సమరానికి సై అంటోంది…అయితే కేంద్రంలో టిడిపి మంత్రులు రాజీనామాలు చేసిన తరువాత రాష్ట్రంలో మంత్రి పదవులకి బిజెపి వాళ్ళు కూడా రాజీనామాలు చేశారు.
అయితే ఇప్పటికే ఎంతో మంది కమల నేతలు ఏపీ బీజేపిలో ఉండాలా ఉండకూడదా అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే దేశవ్యాప్తంగా కమల వికాసం ఎలా ఉన్నా సరే ఏపీలో మాత్రం ఈ సారి చావు దెబ్బ తింటుంది అనే టాక్ వినిపిస్తోంది.ఏపీ ప్రజలు అందరికీ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఎలా అయితే విలన్ అయ్యిందో ఇప్పుడు బీజేపిని కూడా ఏపీ ప్రజలు విలన్ లానే భావిస్తున్నారు.
అందుకే ఏపీ బీజేపి నేతలు ఇప్పటి నుంచే తమ భవిష్యత్తు పై ముందు జాగ్రత్తలు పడుతున్నారని తెలుస్తోంది.ఎంత తొందరగా బీజేపి ని వీడి వేరే పార్టీలోకి వెళ్తే ఎంతమంచిది ప్రజలు కూడా మనకి పట్టం కడుతారు అనే ఆలోచనకి వచ్చేశారు.
అందులో భాగంగానే ఇటీవల టిడిపి కి రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్ బీజేపి ని వీదనున్నారని సమాచారం.అయితే బిజెపి ని వీడిన కామినేని మళ్ళీ తన పాత బాస్ దగ్గరకి వెళ్తారా లేక జగన్ గూటికి చేరుకుంటార అదీ కాకపోతే జనసేన తో జట్టు కడుతారా అనే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారట.
అదేంటంటే.
కామినేని శ్రీనివాస్ ఎంతో జాగ్రత్త పరుడు ఎప్పుడు ఎటువంటి సందర్భంలో ఏ పార్టీలోకి జంప్ చేయాలో ఆ పార్టీలోకి వెళ్ళిపోతాడు.
అంతేకాదు ఇప్పుడు బిజెపి లో ఉన్న కామినేని అంతకుముందు టిడిపి నుంచీ బిజెపి లోకి మారారు.అయితే ఈ విషయంలో కామినేనికి చంద్రబాబు గైడెన్స్ ఉండనే టాక్ కూడా ఉంది.
అయితే ఇప్పుడు బిజెపి నుంచీ కామినేని టిడిపి లోకి వేల్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నా అవేమి నిజం కాదని కామినేని జనసేన అధినేత పైపు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు జనసేనానితో కామినేనికి మంచి సాన్నిహిత్యం కూడా ఉంది.
వివాద రహితుడుగా ఉండే కామినేని రాకని జనసేనాని కూడా కాదనడం లేదని టాక్ వినిపిస్తోంది.గతంలో కామినేని పీఆర్పీ లో కూడా పనిచేయడంతో ఆ అనుభంధం ఇప్పుడు జనసేన లోకి వెళ్ళేలా చేస్తోంది అంటున్నారు.
అయితే కామినేని ముందుగా బీజేపి ని వీడితే ఆ బాటలో మరి కొంతమంది బీజేపి నేతలు కూడా ఉంటారని అంటున్నారు విశ్లేషకులు.