ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుకి కోపం ఎక్కువ అంటారు ప్రత్యర్ధి పార్టీ మీద కానీ.జగన్ మీద అయినా…ప్రభుత్వం తరుపునుంచీ మాట్లాడాలని అనుకున్నా సరే చంద్రబాబు అచ్చెన్నాయుడు ని రంగంలోకి దింపుతారు…తనదైన శైలిలో అచ్చెన్న ఓవర్ స్పీడులో ప్రత్యర్ధుల్ని “డీ” కొడతారు కూడా అయితే ఇప్పుడు ఇదే దూకుడు టిడిపికి ,టిడిపి మంత్రులకి శ్రీకాకుళం లో నాయకులకి పెద్ద తలనెప్పి తెచ్చి పెడుతోంది.
అంతా నాయిష్టం అంటూ మంత్రి ఒంటెద్దు పోకడలు.మిగిలిన మంత్రులకి చికాకు తెప్పిస్తున్నాయి.
శ్రీకాకుళం అంటే ఒకప్పుడు ఎర్రన్నాయుడు,ఆయన చేసిన మంచి పనులు పార్టీకి పార్టీలో ఉన్న వ్యక్తులకి ఆయన ఇచ్చే గౌరవం గుర్తొస్తుంది ఇప్పుడు శ్రీకాకుళం అంటేనే మాకు చికాకుగా ఉంది…తన అన్న ఎర్రన్నాయుడు భావాలకి విరుద్దంగా అచ్చెన్న చేస్తున్న పనులు మాకు విసుగు కలిగిస్తున్నాయి అని కొందరు మంత్రులు అనుకుంటున్నారని టాక్.అసలు విషయం ఏమిటి అంటే
ప్రభుత్వంలో ఉండే మంత్రుల శాఖలు ఆయా మంత్రుల ఆధీనంలో.
కార్యదర్శులతో కలిసి పనిచేస్తారు.మంత్రుల నిర్ణయం మేరకు ఆయా శాఖల్లో ఉత్తర్వులు వెలువడుతు ఉంటాయి ఇది చట్టబద్దం.
కానీ శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి పప్పులు ఏమీ ఉడకవు మంత్రి అచ్చెన్నాయుడు ముందు.ఎటువంటి జీవో అయినా సరే ఆయన ముందు డమ్మీ అవ్వాల్సిందే శ్రీకాకుళానికి మాత్రం ప్రత్యేకమైన జీవో ఉంది అదే “అచ్చెన్న జీవో”.
ఈ జీవో ప్రకారమే అందరు నడుచుకోవాలి.ఈ ఎఫెక్ట్ ఎవరికో తగిలితే పెద్దగా పట్టించుకోరు కానీ ఏకంగా మంత్రి ఘంటా ఇచ్చిన ఆదేశాలనే వెనక్కి పంపేశారు అంటే అచ్చెన్నాయుడి ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు
జిల్లా విద్యాధికారిగా గంటా నియమించిన ఓ అధికారిని చేరటానికి వీల్లేదంటూ అచ్చెన్న వెనక్కు పంపేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వాన అయ్యేలా ఉంది.ఖాళీగా ఉన్న జిల్లా విద్యాధికారుల పోస్టులలో రెగ్యులర్ డీఈఓలను నియమిస్తూ.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.సాయిరాంను శ్రీకాకుళం జిల్లా విద్యాధికారిగా నియమించారు.బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమైన సదరు అధికారిని జిల్లా డీఈఓగా జాయిన్ అవ్వడానికి వీలు లేదు అని చెప్పడంతో.అచ్చెన్న దగ్గర మీరు చెప్పినట్టు వింటాను అని మోర పెట్టుకున్నారట అయినా ఫలితం మాత్రం శూన్యం.