వెల్లుల్లిని తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వెల్లుల్లిని వంటల్లో వాడటం వలన వంటకు అదనపు రుచి వస్తుంది.
ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లిని తినటం వలన సహజ యాంటీ బయోటిక్‌గా పనిచేసి జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.ఉదయం పరగడుపున వెల్లుల్లిని తింటే, వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే రసాయనం బ్యాక్టీరియాతో సులభంగా బంధాన్ని ఏర్పరచుకొని, మంచి ఫలితాలను అందిస్తుంది.
పరగడపున వెల్లుల్లి తినడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
వెల్లుల్లిలో హైడ్రోజన్ సల్ఫేట్, నైట్రిక యాసిడ్ ఉండుట వలన రక్త ప్రసరణ మెరుగుపర్చి గుండె జబ్బులను తగ్గిస్తుంది.
పొద్దున్నే వెల్లులి తినడం వల్ల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి.
వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు జలుబు, ఫ్లూ, జ్వరం వంటి వాటిని నివారిస్తుంది.ఒంట్లో పేరుకున్న కొవ్వును కరిగించడానికి కూడా వెల్లుల్లి సహాయపడుతుంది.
వెల్లుల్లిలో విటమిన్ ‘సి’ అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకి ఔషధంగా పనిచేస్తుంది.
ఒత్తిడికి గురైనపుడు కడుపులో ఆమ్లాలు అధిక మొత్తంలో విడుదల అవుతాయి, అలాంటి సమయంలో వెల్లుల్లి ఈ ఆసిడ్ ల స్థాయిలను తగ్గించి, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
అర చెంచా నేతిలో వేయించియన రెండు వెల్లుల్లి పాయలను క్రమం తప్పకుండా తింటే జలుబు, ము క్కు దిబ్బడ తగ్గుతాయి.
రెండు వెల్లుల్లి పాయల రసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే ముఖ వర్చసు ఆకర్షణీయంగా ఉంటుంది.