మనదేశంలో టాయిలెట్ లేని ఇల్లుల్లు ఇప్పటికి వేళలో కాదు, లక్షల్లో ఉంటాయి అనుకుంటా.బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన అనేది మన దేశంలో ఒక మామూలు విషయం.
పల్లెల్లో అయినా ఇళ్ళకు దూరంగా పొలాల్లోకి వెళ్లి పని కానిస్తారు కాని పట్టన్నల్లో, హైవే పక్కన్నే మూత్రవిసర్జన చేస్తారు చాలామంది.ఆమధ్య హైదరాబాద్ పోలీసులు ఇలా చేస్తున్నవారి ఫోటోలు తీసి నెట్ లో పెట్టేసారు.
అది చూసైనా ఇలాంటి పనులు నిజంగానే మానేస్తారు అనుకుంటే అది అత్యాశే.ఇలాంటి వారి కోసం ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్స్ అరేంజ్ చ్చేసినా, ఏమాత్రం లాభం లేదు.
ఎందుకు అంటే, అలా చేయడం చట్టరీత్య నేరం కాదు కాబట్టి
ఇలాంటి పనులు వెస్ట్రన్ దేశాల్లో చేస్తే జైల్లో వేస్తారు.కాని పోలీసులని కూడా ముప్పుతిప్పలు పెడుతోంది ఓ అమ్మాయి.
అమెరికాలోని కలోరాడో ప్రాంతంలో ఒక ఇంటిని తన టాయిలెట్ గా మార్చుకుంది ఓ గుర్తుతెలియని అమ్మాయి.పేరు తెలియదు, ఊరు తెలియదు, ఆచూకి తెలియదు.
అసలు ఆమెకి మతిస్థిమితం ఉందొ లేదో కూడా తెలియదు.
వివరాల్లోకి వెళితే, 35 ఏళ్ల బుద్దే ఓరోజు వంటగదిలో ఉండగా, ఆమె పిల్లలు వచ్చి “అమ్మ, ఎవరో అమ్మాయి మన గార్డెన్ లో టాయిలెట్ చేస్తోంది” అన్నారు.
ఆ ఇల్లాలికి అస్సలు అర్థం కాలేదు పిల్లలు ఏం చెబుతున్నారో.అసలేం మాట్లాడుతున్నారా మీరు, అమ్మాయి వచ్చి మన గార్డెన్ లో అలాంటి పనులు చేయడం ఏమిటి అని మరోసారి అడిగింది.
నిజం అమ్మ, వచ్చి చూడు అన్నారు.వెళ్లి చూస్తే దర్జాగా మలవిసర్జనలో బిజీగా ఉంది ఆ అమ్మాయి.“ఏయ్ ఏం చేస్తున్నావ్, పిల్లల ముందు ఏమిటి ఈ పనులు గట్టిగా గద్దరించేసరికి అక్కడి నుంచి పరుగు తీసింది.ఆరోజు నుంచి మొదలు, సడెన్ గా ఎప్పుడు వచ్చేది తెలిదు, మలం, మూత్రం తేడా లేకుండా, ఎప్పుడు వారి గార్డెన్ ని టాయిలెట్ లా మార్చేది తెలిదు.
విసర్జన చేసి శుభ్రం చేయడకుండానే వెళ్ళిపోతుంది.పనిలో ఉండగా మూడు సార్లు కనబడింది.ఆ పొజిషన్ లో వీళ్ళు మాత్రం ఎలా పట్టుకుంటారు ఆ అమ్మాయిని.పరుగు మొదలుపెట్టిందంటే పట్టుకోవడం ఎవరి తరం కావడం లేదు.
ఆ పరిసరాల్లో పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాసరే, వారి ఇంటినే టార్గెట్ చేస్తోంది
ఈ తిప్పలు పడలేక పోలీసులని ఆశ్రయించింది ఆ కుటుంబం.పోలీసులు ఈ అమ్మాయి కోసం తెగ గాలింపు చేస్తున్నారు.
ఇప్పటివరకైతే దొరకలేదు.పోలీసుల కళ్లుగప్పి కూడా గార్డెన్ ని మళ్ళీ టాయిలెట్ లా వాడుకుంది ఆ గుర్తుతెలియని అమ్మాయి.
ఇదేమి వింత కేసురా అని తల బాదుకుంటున్నారు పోలీసులు.కొంతమంది మహిళా పోలీసులని స్పెషల్ గా రంగంలోకి దించారు.
మరి ఆ వెరైటి మనిషి మరి ఎప్పుడు చిక్కుతుందో.