చిన్నపిల్లలు చాకోలేట్ కావాలని, బబుల్ గమ్ కావాలని మరాం చేస్తే ఒక్కసారేగా, ఫర్వాలేదు అంటూ కొనీయవద్దు.అక్కడే అలవాటుకి బీజం పడేది.
ఇక ఈ అలవాటు ఎందుకు వద్దు అని పరిశోధకులు అంటున్నారంటే, కేవలం బబుల్ గమ్ మాత్రమే కాదు, చాకోలేట్ కూడా ప్రేగుకి ప్రమాదమే అంట.
చాకొలెట్లు, బబుల్ గమ్స్ లో టైటానియమ్ డియాక్సైడ్ అనే పదార్థం వాడుతున్నారని ఇటివలే జరిగిన కొన్ని పరిశోధనల్లో తేలింది.ఈ పదార్థం సన్ స్క్రీన్ లోషన్స్ లో వాడేది కావడంతో పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు.చాకోట్లు స్మూత్ గా ఉండటానికి, టెక్చర్ ఆకర్షిణీయంగా, మెరిసినట్లు ఉండటానికి ఈ పదార్థాన్ని వాడుతున్నారట.
ఈ పదార్థం కడుపులో పడితే, మనం ఎంత మంచి ఆహారం తిన్నా, జింక్, ఫ్యాట్టి ఆసిడ్స్, ఐరన్ లాంటి న్యూట్రింట్స్ ని శరీరం అబ్జర్వ్ చేసుకోకుండా అడ్డుకుంటుందట టైటానియమ్ డియాక్సైడ్.అంటే దీనివలన శరీరం పోందాల్సిన పోషకాలు అందవు అన్నమాట.
ఇక్కడితో ఆగిపోలేదు, ఇది పేగుల వ్యవస్థను, జీర్ణవ్యవస్థ క్రమంగా నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ప్రాడక్ట్స్ లో ఈ పదార్థం కలుపుతున్నట్లు, చాలా వరకు హెల్త్ ఆండ్ డ్రగ్ ఏజిన్సిలు కూడా గుర్తించకపోవడం.
కాబట్టి, మీ పిల్లల ఆరోగ్యం జాగ్రత్త.