ప్రేయసి ప్రేమికుడైనా, భార్యాభార్తలైనా, గొడవలు జరగడం సాధారణ విషయమే.అసలు గొడవలు లేని బంధమేది? స్నేహితుల మధ్య కూడా గొడవలు జరుగుతాయి ఆ మాటకొస్తే.క్షణికావేశంలో ఏదేదో మాట్లాడేస్తుంటాం.అనరాని మాటలు అనేస్తుంటాం.అవతలి వ్యక్తీ కూడా మనల్ని బాధపెట్టే విషయాలు మాట్లాడతాడు.మరి గొడవ జరిగాక ఏం చేయాలి ? ఏం చేయకూడదు.విరిగిన బంధాన్ని మళ్ళీ కలపాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ?
* మొదటి విషయం.గొడవ జరిగాక బాధపడటం సహజం.
కాని అవతలి వ్యక్తితో మన బంధాన్ని గుర్తు తెచ్చుకోవాలి.ఇక గుర్తుతెచ్చుకోకూడని విషయాలు ఏంటంటే, గొడవ సమయంలో వారి మాటలు.
కొన్ని అవమానకరంగా ఉండవచ్చు, మనకి నచ్చకపోవచ్చు.కాని ఆవేశంలో అనేసిన మాటలే అని అర్థం చేసుకోవాలి.
* లాస్ట్ పంచ్ మనదే అవ్వాలి అనే పట్టింపు వద్దు.అవతలి వ్యక్తీ ఓ మాట అన్నారు, దానికి సమాధానం ఇవ్వాల్సిందే, నా డామినేషన్ తోనే గొడవ అయిపోవాలి అని అనుకోవద్దు.
* గొడవ జరిగిన విషయాన్ని అందరితో చెప్పొద్దు.ఒక వ్యక్తిగా మీ భాగస్వామి మీ కన్నా ఎక్కువ ఎవరికీ తెలియదు.
కాబట్టి ఉచిత సలహాల వెంటపోవద్దు.నలుగురికి విషయం తెలిస్తే, మీ భాగస్వామికి ఇంకా కోపం రావచ్చు కూడా.
* ఆవేశంలో అనేసిన ప్రతి అక్షరాన్ని భూతద్దంలో చూడవద్దు.అలాగే నేను ఇలా సమాధానమివ్వాల్సింది, అలా అనాల్సింది, మళ్ళీ గొడవ జరిగితే బాగుండు, ఈ విషయాలన్నీ బయటకి తీయాలి అనే ఆలోచన మానుకుంటే మంచిది.
* మీ భాగస్వామి ముందు మీరెప్పుడు తక్కువైపోరు.తను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే, కేవలం ఓ గొడవ వలన చులకనగా చూడటం అంటూ ఉండదు.
కాబట్టి ముందే మీరే మాట్లాడితే వచ్చే నష్టమేమి లేదు.