ఆ హీరోలు బూతులు కూడా మాట్లాడుకుంటారట

సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ .ముగ్గురిలో చాలా విషయాలు కామన్.

 Three Khans Even Talk Dirty Things Together-TeluguStop.com

ముగ్గురు ఒకే సంవత్సరంలో పుట్టారు.ముగ్గురు రెండు దశాబ్దాలుగా బాలివుడ్ ఇండస్ట్రీని ఏలుతూనే ఉన్నారు.

వీరి అభిమానులు ఎంత గొడవపడినా, అప్పుడప్పుడు వీరి మధ్య కూడా కొన్ని ఘర్షణలు జరిగినా, ఈ ముగ్గురు ఇంకా స్నేహితులుగానే ఉండటం అబ్బురపరిచే విషయం.

నిన్న షారుఖ్ ఖాన్ పుట్టినరోజు.

ఆ సందర్భంగా బాలివుడ్ మీడియాకి ఇంటర్వ్యూలు బాగానే ఇచ్చాడు షారుఖ్.ఇక ముగ్గురు ఖాన్ల గురించి మాట్లాడుతూ ” సల్మాన్, ఆమీర్, నేను ఎప్పుడూ మా సూపర్ స్టార్ డమ్ గురించి మాట్లాడుకోం.

కొన్నిసార్లు మేం ముగ్గురం కలిసి పనిచేస్తే ఎంత పెద్ద మార్పు వస్తుందో అని చర్చించుకుంటాం.ఇప్పటివరకు మేం మాట్లాడుకునే మంచి విషయాల గురించే చెప్పాను.

కాని మేము అన్ని మంచి విషయాలే మాట్లాడుకోం, కొన్ని చెత్త విషయాలు, బూతులు కూడా మాట్లాడుకుంటాం” అంటూ తమ ముగ్గురి స్నేహంలోని భిన్న అనుభూతుల గురించి చెప్పాడు షారుఖ్.

ఈ కింగ్ ఖాన్ ముచ్చట్లు వింటుంటే, మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మహేష్, పవన్, ఎన్టీఆర్ లాంటి హీరోల మధ్య ఇలాంటి స్నేహం ఉండుంటే ఎంత బాగుండేదో అని అనిపిస్తోంది కదా!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube