తిరుమలలో ఏడు కొండలు ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఆ కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? ఇప్పుడు ఆ కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.
1.శేషాద్రి
సప్త గిరులలో శేషాద్రి ప్రధానమైనది.ఆదిశేషుని పేరిట నెలకొన్న కొండ.
2.నీలాద్రి
స్వామివారికి మొదటిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి.ఆమె పేరున ఈ కొండ వెలసింది.
3.గరుడాద్రి
మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు కొండ రూపంలో వెలిశారు.
4.అంజనాద్రి
హనుమంతుని తల్లి అంజనాదేవి తపస్సు చేసిన ప్రదేశం అంజనాద్రిగా వెలసింది.
5.వృషభాద్రి
మహావిష్ణువు చేతిలో హతం అయిన రాక్షసుడు వృషబాసురుడు పేరిట వృషభాద్రి కొండ వెలసింది.
6.నారాయణాద్రి
పుష్కరిణి తీరంలో తపం ఆచరించిన నారాయణుడి పేరుతొ నారాయణాద్రి కొండ వెలిసింది.
7.వెంకటాద్రి
సర్వ పాపాలు పోగొట్టే కొండ కాబట్టి ఈ పవిత్ర కొండకు వెంకటాద్రి అని పేరు వచ్చింది.