లాస్ ఏంజెల్స్‌లో కాల్పులు.. జస్టిన్ బీబర్ షో ముగిసిన కాసేపటికే ఘటన, నలుగురికి గాయాలు

ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా .నేరస్తులను కఠినంగా శిక్షిస్తున్నా అమెరికాలో గన్ కల్చర్‌కు ఎండ్ కార్డ్ మాత్రం పడటం లేదు.

 4 Shot Outside Los Angeles Party Held After Justin Bieber's Concert, Homecoming-TeluguStop.com

నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.

ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.

శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.

తాజాగా అమెరికాలోని రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజెల్స్‌లో తుపాకులు గర్జించాయి.ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

శనివారం తెల్లవారుజామున ప్రముఖ ర్యాపర్ జస్టిన్ బీబర్ మ్యూజికల్ షో ముగిసిన ప్రదేశానికి కూత వేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.ది నైస్ గై రెస్టారెంట్ లాంజ్ వెలుపల ఈ కాల్పులు జరిగాయి.60, 22, 20, 19 సంవత్సరాల వయసు గల నలుగురు పురుషులు ఈ ఘటనలో గాయపడినట్లు అధికారులు తెలిపారు.అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.నిందితులను గుర్తించేందుకు ముందుకు రావాలని దర్యాప్తు అధికారులు ప్రజలను కోరారు.

కాగా.ఈ ఘటన జరగడానికి కొద్దిసేపు ముందు ‘‘హోమ్‌కమింగ్ వీకెండ్’’ పేరిట వెస్ట్ హాలీవుడ్‌లోని పసిఫిక్ డిజైన్ సెంటర్‌లో జస్టిన్ బీబర్ ప్రైవేట్ షో జరుగుతోంది.

ఈ ఈవెంట్‌లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, అతని ప్రియురాలు టీవీ హోస్ట్ లారెన్ సాంచెజ్, నటుడు ఆంటోని రామోస్, ఎన్ఎఫ్ఎల్ హాల్ ఆఫ్ ఫేమర్ టోనీ గొంజాలెజ్ వున్నారు.అంతేకాకుండా బీబర్ ఆయన భార్య హేలీ బాల్డివన్, డ్రేక్, ఖోలే కర్దాషియాన్, టోబే మాగైర్‌ వంటి ప్రముఖులు కూడా పార్టీలో పాల్గొన్న వారిలో వున్నారు.

4 Shot Outside Los Angeles Party Held After Justin Bieber's Concert, Homecoming Weekend, Justin Bieber's Concert, Gun Culture, Amazon Boss Jeff Bezos, The Nice Guy Restaurant Lounge, Rapper Justin Bieber Musical Show , Actor Anthony Ramos - Telugu Losangeles, Anthony Ramos, Amazonboss, Gun, Weekend, Justinbiebers, Rapperjustin, Guyrestaurant

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube