గాల్వాన్ ఘర్షణ పై మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు అంటూ వస్తున్న వార్తలు తప్పు..

ఇటీవల భారత్-చైనా దళాల మధ్య గాల్వాన్ వ్యాలీ లో ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ ఘర్షణ లో తెలంగాణా వాసి కల్నల్ సంతోష్ బాబు తో సహా మొత్తం 21 మంది భారత సైనికులు వీర మరణం పొందగా,చైనా సైనికుల గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడికాలేదు.

 100 China Army Dead In Galwan Incident Is Fake News- Caina, India, China App, Ga-TeluguStop.com

గాల్వాన్ వ్యాలీ లో భారత భూభాగాన్ని ఆక్రమించడానికి చైనా,భారత్ పై కాలు దువ్వుతుంది. ఈ క్రమంలో అక్కడ పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన క్రమంలో కల్నల్ సంతోష్ బాబు కూడా అక్కడకి వెళ్లడం ఆ సమయంలో కొంత వాగ్వివాదం చోటుచేసుకోవడం ఆ తరువాత అది ఘర్షణకు దారి తీసింది.

ఈ క్రమంలో చైనా ఆర్మీ భారత ఆర్మీ పై రాళ్లతో దాడి కి దిగడం తో ఈ దాడిలో కల్నల్ సంతోష్ బాబు తో సహా 21 మంది భారత సైనికులు వీరమరణం పొందారు.

అయితే ఈ ఘర్షణ లో చైనా సైనికులు ఎందరు మరణించారణే విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం మాత్రం ప్రకటించలేదు.

కానీ, దాదాపు 40 మంది చైనా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియాలో మాత్రం కధనాలు వచ్చాయి.

జూన్ 15 అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ పరిణామం తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే భారత్ చైనా కు సంబందించిన పలు యాప్ లపై నిషేధం కూడా విధించింది.

Corrections : 7/11/2020

ఈ పోస్ట్ ముందు వర్షన్ లో “ఈ గాల్వాన్ వ్యాలీ ఘర్షణ లో దాదాపు 100 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారంటూ క్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు.” అన్ని తప్పుడు గా పబ్లిష్ చేసాం.పోస్ట్ చేసినందుకు మన్నించగలరు.

గల్వాన్ ఘటనలో 100 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారని జియాన్లీ యాంగ్ ఎక్కడా చెప్పలేదు.అంతేకాదు, పోస్ట్ లో చెప్పినట్టు జియాన్లీ యాంగ్ చైనా మాజీ సైనిక అధికారి కాదు.

కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.పూర్తి వివరాల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube