టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అభిమానులు కొత్త సినిమాల రిలీజ్ కంటే కూడా ఎక్కువ రీ రిలీజ్ మూవీస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు.
ఎందుకంటే మన చిన్నతనం లో మన అభిమాన హీరోల సినిమాలు చూసి ఉండక పోవచ్చు, అందుకే ఈ సినిమాలకు ఇంత క్రేజ్ ఏర్పడింది. మహేష్ బాబు( Mahesh Babu ) పుట్టిన రోజు నాడు ‘పోకిరి’ సినిమా స్పెషల్ షోస్ తో ఈ ట్రెండ్ మొదలైంది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జల్సా తో తారాస్థాయికి చేరుకుంది.జల్సా సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో ఇక బయ్యర్స్ నెలకి ఒక రీ రిలీజ్ సినిమాతో మన ముందుకు వస్తూనే ఉన్నారు.
కానీ వీటిల్లో అత్యధికంగా రికార్డ్స్ ని పెట్టిన హీరోలు మాత్రం పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు మాత్రమే.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫ్యాన్స్ గత ఏడాది డిసెంబర్ లో ఖుషి చిత్రం తో మొదటి రోజు నుండి ఫుల్ రన్ వరకు ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రం రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి చాలా సినిమాలే వచ్చాయి కానీ, మహేష్ బాబు బిజినెస్ మెన్ చిత్రం తప్ప ఏది బ్రేక్ చేయలేకపోయాయి.ఇప్పుడు ఈ ‘బిజినెస్ మెన్’ రికార్డ్స్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 2 వ తారీఖున ‘గుడుంబా శంకర్’( Gudumba Shankar ) చిత్రం తో బ్రేక్ చేయబోతున్నారా.?, లేదా కష్టమేనా అనేది తెలియాల్సి ఉంది.ఇప్పటికైతే ఈ సినిమా కొత్త చిత్రాల విడుదల కారణంగా లిమిటెడ్ రిలీజ్ పడేలా ఉంది.
అందువల్ల రికార్డు రాకపోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.కానీ హైదరాబాద్ లో ఇప్పటి వరకు కొన్ని థియేటర్స్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు.
ఈ థియేటర్స్ లో సాధారణంగా కొత్త సినిమాలకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా స్లో గా ఉంటాయి.కానీ ‘గుడుంబా శంకర్’ చిత్రానికి మాత్రం వారం రోజుల ముందే హౌస్ ఫుల్స్ పడ్డాయి.ఒక ఫ్లాప్ చిత్రానికి ఈ రేంజ్ అంటే సాధారణమైన విషయం కాదు.భారీ స్థాయి షోస్ పెంచితే, కచ్చితంగా ఈ చిత్రం మరో ఆల్ టైం రికార్డు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టిస్తుందని నమ్ముతున్నారు ట్రేడ్ పండితులు.
కానీ అంత పెద్ద రిలీజ్ దొరుకుంటుందా లేదా అనేది విజయ్ దేవరకొండ ఖుషి చిత్రం ( Kushi )ఫలితం పైనే ఆధారపడి ఉంది.ఇప్పటి వరకు ప్రారంబించి౮న హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.