టెర్రిఫిక్‌ సెకండ్‌ వీక్‌ కలెక్షన్ల వైపు అశోకవనంలో అర్జున కల్యాణం

విశ్వక్‌సేన్‌ హీరోగా తెరకెక్కిన అశోకవనంలో అర్జునకల్యాణం మే 6న విడుదలైంది.చక్కటి రివ్యూలు, పాజిటివ్‌ మౌత్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ దగ్గర దూసుకుపోతోంది అశోకవనంలో అర్జున కల్యాణం.

 Ashokavanamlo Arjunakalyanam Second Week Collections Ashokavanamlo Arjunakalyan-TeluguStop.com

రోజురోజుకీ సినిమా మీద జనాల్లో ఇంట్రస్ట్ పెరుగుతోంది.చాన్నాళ్ల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్ల ముందు క్యూలు కడుతున్నారు.

సిట్చువేషనల్‌ కామెడీ, లవ్‌ ఎమోషన్స్, పర్ఫెక్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ తో కూడిన సినిమాగా ప్రేక్షకుల మెప్పు పొందుతోంది అశోకవనంలో అర్జున కల్యాణం.

సినిమా విడుదలై వారం రోజులు అయినా ఇంకా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు ట్రేడ్‌ పండిట్స్.

రెండో వారంలోనూ ఇన్ని మంచి థియేటర్లతో సినిమా రన్‌ అవుతుంటే మనసు నిండిపోయిందన్నది మేకర్స్ మాట.విశ్వక్‌సేన్‌ చేసిన హార్డ్ వర్క్ కి బాక్సాఫీస్‌ దగ్గర కాసుల పంట పండుతోందని మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్.తనకు నచ్చిన అమ్మాయి మనసుకు దగ్గరవ్వాలని 33 ఏళ్ల యువకుడు నిజాయతీగా చేసిన ప్రయత్నంగా అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు స్పెషల్‌ అప్లాజ్‌ వస్తోంది.తనకున్న మాస్‌ ఇమేజ్‌ని పక్కనపెట్టి , కాస్త బరువుపెరిగి కేరక్టర్‌లో లీనమై విశ్వక్‌సేన్‌ నటించిన తీరుకు జనాలు మెచ్చుకుంటున్నారు.

డైరక్టర్‌ విద్యాసాగర్‌ చింత ప్రయత్నానికి ప్రశంసలు దక్కుతున్నాయి.రవికిరణ్‌ కోలా రాసిన కథలో సెన్సిటివ్‌ ఎలిమెంట్స్ కి యూత్‌ ప్లస్‌ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.జై క్రిష్‌ కంపోజ్‌ చేసిన ట్యూన్ల, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా సక్సెస్‌లో కీలక భాగమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube