మే 31వ తారీఖున తెలంగాణ హైకోర్టు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ( Y.S.Avinash Reddy )కి ముందస్తు బెయిల్ మంజూరు చేయటం తెలిసిందే.పరిస్థితి ఇలా ఉంటే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీత రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పులలో లోపాలు ఉన్నాయని…సీబీఐ అభియోగాలు హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు అంటూ సునీత రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ బుధవారం సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉంది.ఇదే సందర్భంలో అత్యున్నత న్యాయస్థానంలో సీబీఐ తన వాదనలు వినిపించనుంది.ఆల్రెడీ అవినాష్ రెడ్డికి బెయిల్ రావడాని సీబీఐ వ్యతిరేకించటం జరిగింది.
ఈ క్రమంలో సుప్రీం లో సునీత పిటిషన్ పై సీబీఐ ఎటువంటి వాదనలు వినిపించనుంది అనేది ఆసక్తికరంగా మారింది.ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ కేసు విషయంలో ఇప్పటికే ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పలుమార్లు సీబీఐ విచారణకు హాజరు కావడం జరిగింది.
ఈ క్రమంలో ఆయన తల్లికి గుండెపోటు రావడం జరిగింది.దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి హాస్పిటల్లో ఉండటంతో ఆమె బాగోగులు చూసుకోవడానికి తనకు ముందస్తు బెయిల్ కావాలని తెలంగాణ హైకోర్టుని ఎంపీ అవినాష్ కోరాటం జరిగింది.
ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.