“మేమంతా సిద్ధం” పేరిట వైయస్ జగన్( YS Jagan ) చేపడుతున్న బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది.కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఈ యాత్రకు జనాల నుండి మంచి స్పందన రావడం జరిగింది.
ఈ క్రమంలో ఎమ్మిగనూరులో సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది.
పేదలకు మరియు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతోంది.ఈ పొత్తులను, జిత్తులను.
ఈ మోసాలను కుట్రలను వీటన్నిటిని ఎదుర్కొంటూ పేదల భవిష్యత్ కు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.
58 నెలలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.మనం చేసిన మంచి కొనసాగాలని ప్రతి గుండె కోరుకుంటుంది.పేదలంతా ఒకవైపు… పెత్తందారులు మరోవైపు.
పేదల వ్యతిరేకులను ఓడించండి.మీ బిడ్డను గెలిపించండి అంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఇక ఇదే సభలో కర్నూలు నుంచి హఫీజ్ ఖాన్( Hafiz Khan ) కి టికెట్ ఇవ్వలేకపోయానని సీఎం జగన్ అన్నారు.కానీ ఆయనను రెండేళ్ల తర్వాత రాజ్యసభకు పంపిస్తా.
నా మనసులో కల్మషం లేదు కాబట్టి లక్షల మంది సమక్షంలో ఈ మాట చెబుతున్నా.జగన్ కు చంద్రబాబుకు మధ్య తేడా గమనించండి.అని ఆయన వ్యాఖ్యానించారు.2024 ఎన్నికలకు సంబంధించి కర్నూల్ సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కి కాదని ఈసారి ఇంతియాజ్ కి వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించడం జరిగింది.