యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) దేవర సినిమాలో( Devara ) డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.దేవర పాన్ ఇండియా మూవీగా తెరకెక్కగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో తెరకెక్కిందని సమాచారం అందుతోంది.
అయితే దేవరలో ఈ రెండు పాత్రలు కాకుండా మరో పాత్ర ఉంటుందని మూడో పాత్ర తాత పాత్ర అని ప్రచారం జరుగుతోంది.
ట్రైలర్ లోని ఒక షాట్ లో మండుతున్న కత్తులు పట్టుకుని ఉన్న షాట్ లో మరో ఎన్టీఆర్ కనిపిస్తారని క్లైమాక్స్ లో ఆ పాత్ర ఎంట్రీ ఉంటుందని సమాచారం అందుతోంది.దేవర సినిమా ట్విస్టుల గురించి వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.దేవరలో మూడో వాడు ఉంటే మాత్రం సంచలనం అవుతుంది.
కొరటాల శివ( Koratala Siva ) ఈ సినిమా విషయంలో ఎలా ప్లాన్ చేశారో తెలియాల్సి ఉంది.
దేవర సినిమాలో ఊహించని ట్విస్టులకు అయితే లోటు ఉండదని తెలుస్తోంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తారక్ బిజీ కావాలని ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండగా దేవర సినిమాలో తారక్ లుక్స్ విషయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుండగా అలా ట్రోల్స్ చేస్తున్న వాళ్లకు విశ్వక్ సేన్ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.దేవర సినిమాపై ఇండస్ట్రీ సైతం చాలా ఆశలు పెట్టుకుంది.
అదే సమయంలో సినిమాలకు సంబంధించి ట్రోల్స్ ఒక లిమిట్ వరకు బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేవర సినిమాపై కావాలని ట్రోల్స్ చేస్తే ఎవరు ట్రోల్స్ చేశారో వాళ్ల హీరోల సినిమాలపై కూడా ఇదే విధంగా ట్రోల్స్ చేస్తామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దేవరకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.దేవర సినిమాలో మరో హీరోయిన్ గా శృతి మరాఠే నటిస్తున్నారు.