టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న యంగ్ హీరోలు వీళ్లే?

ఒకసారి సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత మీ దగ్గర ఎంత టాలెంటు ఉంది అన్నది కాదు.మీకు ఎలాంటి సక్సెస్ వచ్చింది అన్నది అందరూ చూస్తూ ఉంటారు.

 Young Heros Are Looking To Get Hit, Tollywood, Sharwanandh , Ram Pothinani , Nan-TeluguStop.com

ఇక ఇలా సక్సెస్ ని బట్టి ఇండస్ట్రీలో క్రేజ్ డిసైడ్ అవుతూ ఉంటుంది.  పారితోషికం కూడా హిట్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అందుకే ఇప్పటికీ ఎంతోమంది యువ హీరోలు అడపాదడపా హిట్ సినిమాలు చేస్తున్నప్పటికీ బ్లాక్బస్టర్ విజయాలను సాధించి స్టార్ హీరో గా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఇలా బ్లాక్ బస్టర్ కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం టాలీవుడ్ లో అటు స్టార్ హీరో ఇటు చిన్న హీరో కాకుండా మిడిల్  హీరోగా కొనసాగుతున్నాడు శర్వానంద్.కొంత కాలం నుంచి వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు.

ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.దీంతో పాటు ఒకే ఒక జీవితం సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే చాలు అనుకుంటున్నాడు.

నాచురల్ స్టార్ నాని.

టాలీవుడ్ లో మంచి క్రేజ్ వున్న హీరో.కానీ అటు స్టార్ హీరోకి మాత్రం కాస్త తక్కువే.

గత కొంత కాలం నుంచి వరుస ప్లాపులతో సతమతమైన నాని జెర్సీ సినిమాతో మంచి సక్సెస్ అందు కున్నాడు.ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ తో మళ్ళి అంచనాలను అందుకోలేక ఫర్వాలేదని పించాడు.

ఇటీవల విడుదలైన శ్యామ్ సింగరాయ్ హిట్ కొట్టడంతో కెరియర్ ను కాస్త స్పీడ్ లోకి తీసుకొచ్చాడు.ఇప్పుడు అంటే సుందరానికి అనే సినిమా కంప్లీట్ చేసిన నాని దీనిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

అప్పుడెప్పుడో జయం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్ కూడా ఇంకా స్టార్ హీరోగా నిలదొక్కుకోలేక పోతున్నాడు.హిట్టు ఫ్లాపు ల మధ్య ఊగిసలాడుతున్నాడు భీష్మ తో మంచి హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత చెక్, రంగ్ దే సినిమాలతో మళ్లీ ఫ్లాప్ అందు కున్నాడు.ఇక మొన్నటికి మొన్న ఓ టీవీలో వచ్చిన మ్యాస్ట్రో ఓకే అనిపించింది.ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు నితిన్.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా సరైన హిట్ కోసం వేచి చూస్తున్నాడు.ఒకప్పుడు వరుస ప్లాపులతో సతమతమైన రామ్ 2019లో ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.కానీ గత ఏడాది విడుదలైన రెడ్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది.ఇక ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.వారియర్ గా రామ్ ప్రేక్షకులను పలకరించిన పోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube