ప్రస్తుత కాలంలో కొందరు అవగాహనా లేమి కారణంగా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తమ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు.తాజాగా ఓ యువతి యువకుడిని ప్రేమించడమేగాకుండా తమ పెద్దలకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకుని చివరికి ఆ పెళ్లిని కూడా కాదనుకుని తమ తల్లిదండ్రులు చెప్పినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడడంతో తన భర్త పెళ్లి ఫోటోలను పెళ్లి కొడుకుకి పంపించగా తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందినటువంటి దౌలతాబాద్ మండలంలో ఓ యువతి తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.కాగా కొద్ది కాలం క్రితం యువతి నివాసముంటున్న ప్రాంతంలో మరో యువకుడితో ప్రేమలో పడింది.
ఈ క్రమంలో తమ కుటుంబ పెద్దలకు తెలియకుండా ఈ ప్రేమికులు ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారు.అనంతరం ఎవరి ఇళ్లల్లో వాళ్లు కామ్ గా జీవనం సాగిస్తున్నారు.
ఇక్కడి వరకు అంతా బాగానే సాగింది.అయితే తమ కూతురికి పెళ్లి అయిన విషయం తెలియని యువతి కుటుంబ సభ్యులు యువతికి మరో యువకుడితో వివాహం నిశ్చయించారు.
ఈ విషయం తెలుసుకున్న యువతి భర్త వెంటనే తన భార్య కి కాబోయే భర్తకు తమ పెళ్లి ఫోటోలు మరియు ఏకాంతంగా దిగినటువంటి ఫోటోలను పంపించాడు.దీంతో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు యువతి తల్లిదండ్రులను నిలదీశారు.
దాంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి యువతి ఆత్మహత్య చేసుకుంది.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
దీంతో కొంత మంది నెటిజన్లు కుటుంబ పెద్దలకు తెలియకుండా, ప్రేమ వ్యామోహంలో పెళ్లిళ్లు చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.