తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడున్న చాలా మంది డైరెక్టర్లు ఒకప్పుడు దాసరి నారాయణ రావు, రాఘవేంద్ర రావు ( Dasari Narayana Rao, Raghavendra Rao )లాంటి గొప్ప డైరెక్టర్ల సినిమాలు చూసి వచ్చినవాళ్లే అయితే వాళ్ళు అప్పుడు కమర్షియల్ సినిమాలు తీస్తూనే, మెసేజ్ ఇచ్చే సినిమాలు కూడా తీసేవారు అయితే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్లకి మాత్రం ఒకప్పుడు వాళ్ళు తీసినలాంటి సినిమాలు తీయడం రావడం లేదు అంటూ కొంతమంది వీళ్ల మీద కామెంట్లు చేస్తున్నారు.ఇప్పడూ సినిమా స్థాయి పెరిగిన కూడా అప్పట్లో వచ్చిన మంచి సినిమాల లాంటి సినిమాలు ఇప్పుడైతే రావడం లేదు అంటూన్నారు ఇప్పడూ సినిమా క్వాలిటీ పెరిగింది కానీ కంటెంట్ తగ్గింది అని కామెంట్లు చేస్తున్నారు…అప్పట్లో దాసరి గారు, రాఘవేంద్ర రావు ఇద్దరు కూడా పోటీ పడి మరి హిట్లు కొట్టేవారు వీళ్లు అప్పట్లో చాలా తక్కువ రోజుల్లోనే సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్లు కొట్టేవారు.
అలాగే ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్లకి చాలా మంచి పేరు ఉండేది సీనియర్ ఎన్టీయార్, నాగేశ్వరరావు( NTR, Nageswara Rao ) లాంటి హీరోలతో ఈ ఇద్దరు సూపర్ హిట్ సినిమాలు తీసి ఇండస్ట్రీ లో వాళ్ల ఇమేజ్ ని చాలా బాగా పెంచుకున్నారు.ఇక అందుకే ఈ ఇద్దరు డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రెండు కండ్లు గా చెప్తూ ఉంటారు.
![Telugu Dasari Yana Rao, Raghavendra Rao, Tollywood, Young Directors, Youngdirect Telugu Dasari Yana Rao, Raghavendra Rao, Tollywood, Young Directors, Youngdirect](https://telugustop.com/wp-content/uploads/2023/08/Young-directors-who-are-not-able-to-make-films-like-Dasaria.jpg)
ముఖ్యం గా దాసరి గారు తీసిన చాలా సినిమాల్లో ఒసేయి రాములమ్మ లాంటి సినిమాలు అందరికి విపరీతంగా నచ్చుతాయి అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అయితే ఈ సినిమాలు అప్పట్లో తీసి జనాదరణ పొందిన ఈయన తర్వాత కాలం లో చాలా ప్లాపులు కూడా తీశారు.సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండే సినిమాలు తీయడం దాసరి గారు దిట్ట అనే చెప్పాలి…ఇపుడున్న జనరేషన్ లో ఆయన లా ఒక ప్రాబ్లమ్ మీద గట్టిగా నిల్చొని ఒక సినిమా తీసే స్ట్రాంగ్ డైరెక్టర్ ఎవరు లేరు…ఆయన 150 సినిమాలకి డైరెక్షన్ చేసి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎక్కువ సినిమాలు డైరెక్టన్ చేసిన డైరెక్టర్ గా గిన్నిస్ బుక్ లో పేరు కూడా నమోదు చేసుకున్నారు అంటే ఆయన ఎంత టాలెంటెడ్ డైరెక్టర్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.