'యోగి' రీ రిలీజ్ కలెక్షన్స్ ని డామినేట్ చేస్తున్న 'రఘువరన్ బీటెక్' రీ రిలీజ్ కలెక్షన్స్

ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్( Re Release Trend ) ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల దగ్గర నుండి చిన్న హీరోల సూపర్ హిట్ సినిమాల వరకు ప్రతీ చిత్రం విడుదల అవుతూనే ఉన్నాయి.

 Yogi Movie Re Release Collections Vs Raghuvaran Btech Collections,prabhas,dhanus-TeluguStop.com

వాటిల్లో కొన్ని ఊహించని రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవగా, మరికొన్ని సినిమాలు బోల్తా కొట్టాయి.ముఖ్యంగా కొన్ని చిన్న సినిమాలు అయితే పెద్ద హీరోల సినిమాల రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఆశ్చర్యానికి గురి చేసాయి.

రీసెంట్ గానే విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది'( Ee Nagaraniki Emaindi ) అనే చిన్న చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల రీ రిలీజ్ కలెక్షన్స్ ని కూడా దాటేసి టాప్ 5 లో నిల్చింది.ఇప్పుడు మళ్ళీ అదే ఫీట్ ని రిపీట్ చేయబోతుంది తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘రఘువరన్ బీటెక్'( Raghuvaran BTech ) అనే సినిమా.

Telugu Dhanush, Prabhas, Trend, Tollywood, Yogi, Yogiraghuvaran-Movie

ఈ చిత్రం అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.అంతే కాదు ఈ చిత్రానికి కల్ట్ క్లాసిక్ హోదా కూడా దక్కింది.ఈ సినిమాని రేపు గ్రాండ్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.దానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.

ఈ చిత్రం తో పాటుగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘యోగి'( Yogi ) చిత్రం కూడా విడుదల అవ్వబోతుంది.ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని రఘువరన్ బీటెక్ అనే చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ప్రాంతం లో ఎక్కువ జరిగాయి.

ఈ బుకింగ్స్ ట్రెండ్ ప్రకారం యోగి చిత్రానికి 20 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తుండగా, రఘువరన్ బీటెక్ కి 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు ఉన్నాయి.

Telugu Dhanush, Prabhas, Trend, Tollywood, Yogi, Yogiraghuvaran-Movie

వాస్తవానికి యోగి చిత్రం ప్రభాస్( Prabhas ) కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రం.ఈ సినిమా ని రీ రిలీజ్ చెయ్యాలని అభిమానులు కోరుకోలేదు.కానీ ఈమధ్య వచ్చిన కొన్ని మూడవ పార్టీ కి సంబంధించిన వారు రీ రిలీజ్ చేస్తున్నారు.

ఒక పాత సినిమాని 4K కి మార్చాలంటే కచ్చితంగా 20 లక్షల రూపాయిలు అవుతుంది.పెద్ద హీరోల సినిమాలకు కేవలం ఒక్క టాప్ సెంటర్ నుండి వచ్చే డబ్బులు ఇవి.అందుకే రీ రిలీజ్ చెయ్యడానికి ఎగబడుతున్నారు .కానీ యోగి సినిమా నుండి నష్టాలే వచ్చే లాగ కనిపిస్తున్నాయి.ఎంత ఫ్లాప్ సినిమా అయినా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్స్ లో కనీసం ఒక్క షో అయినా ఫుల్ పడుతుంది.రేపు రఘువరన్ బీటెక్ చిత్రానికి తెల్లవారు జామున ప్రదర్శిస్తున్న ఆటలు రెండు హౌస్ ఫుల్స్ పడగా, యోగి కి కేవలం ఒక్క ఫుల్ మాత్రమే పడింది, ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన టాపిక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube