గ‌జ‌ప‌తిని వ‌ద‌ల‌ని విజ‌య‌సాయి.. మ‌రోమారు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

ఏపీలో ప్ర‌స్తుతం గ‌జ‌ప‌తి రాజు ఎపిసోడ్ న‌డుస్తోంది.ఆయ‌న‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఇప్ప‌టికే క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం గుర్రుగా ఉంటోంది.

 Ycp Mp Vijayasai Reddy Sensational Allegations On Gajapathi Again, Vijaya Sai, G-TeluguStop.com

చాలామంది క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు ఆరోప‌ణ‌ల‌పై లేఖ‌లు కూడా రాస్తున్నారు.దీంతో ఇటు వైసీపీలోని ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు కూడా కౌంట‌ర్లు ఇస్తున్నారు.

అయితే ఎవ‌రేం అనుకున్నా స‌రే విజ‌య‌సాయిరెడ్డి మాత్రం అస్స‌లు వెన‌క్కు త‌గ్గ‌ట్లేదు.

మ‌రోసారి గ‌జ‌ప‌తిరాజుపై ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.

గ‌జ‌ప‌తి రాజు గ‌తంలో చేసిన స్త్రీలకు ఆస్తి హక్కు లేద‌నే వ్యాఖ్య‌ల‌పై మ‌రోసారి విజ‌య‌సాయి మాట‌ల బాణాలు ఎక్కుపెట్టారు.మ‌హిళ‌ల‌కు ఆస్తి హ‌క్కు లేద‌ని పూసపాటి రాజ్యాంగంలో లేదని గ‌జ‌ప‌తిరాజు వాదిస్తే భారత చ‌ట్టం ఒప్పుకోదని ఎద్దేవా చేశారు.

చ‌ట్టానికి లోబ‌డే అన్ని కార్య‌క్ర‌మాలు ఉండాల‌ని ఇన్‌డైరెక్టుగా కౌంట‌ర్ దింపారు.ఫ్యామిలీ లాలు ప‌నిచేయ‌వ‌ని, రాజ్యాంగమే చెల్లుబాటవుతుందని గ‌ట్టి కౌంట‌ర్ వేశారు విజ‌య‌సాయిరెడ్డి.

Telugu Ap Ycp, Ashokgajapathi, Chandrababu, Senior Ntr, Sensational, Vijayasai R

ఇక ఇదే క్ర‌మంలో గ‌జ‌పతి రాజుపై విజ‌య‌సాయి సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు.దివంగ‌త మ‌హానేత ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచిన దాంట్లో అశోక్ గజపతి ప్ర‌ధాన పాత్ర పోషించారంటూ ఆరోపించారు.ఎన్టీఆర్‌ను ఇప్ప‌టి నారా చంద్రబాబు నాయుడు స్వ‌యంగా వెన్నుపోటు పొద‌వ‌గా.గజపతి రాజు ద‌గ్గ‌రుండి మ‌రీ కత్తి అందించాయ‌ర‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.అందుకే ఎన్టీఆర్ పార్టీ నుంచి త‌రిమేసిన వారిలో బాబు మొద‌టి స్థానంలో ఉంటే రెండో స్థానంలో అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఉన్నాడ‌ని ఆరోపించారు.అప్ప‌ట్లో రామారావు ఎమ్మెల్యే శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కోరుతూ అప్ప‌టి ఉమ్మ‌డి రాష్ట్ర స్పీకర్‌కు లేఖ రాశారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

మొత్తానికి గ‌జ‌ప‌తి రాజుపై విజయ‌సాయి విమ‌ర్శ‌లు మాత్రం ఆప‌ట్లేద‌నే చెప్పాలి.మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై గ‌జ‌ప‌తి రాజు ఏమైనా స్పందిస్తారో లేదో అన్న‌ది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube