కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి చేరారు.నారా లోకేశ్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు.
ఈ మేరకు నియోజకవర్గంలోని నిడమానూరు క్యాంప్ సైట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లు రవీంద్ర, బొండా ఉమ, బుద్దా వెంకన్న, వంగవీటి రాధా వంటి ముఖ్య నేతలు పాల్గొన్నారు.అనంతరం నారాలోకేశ్ తో యార్లగడ్డ సమావేశం అయ్యారు.
అయితే ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన యార్లగడ్డ ఆయన ఎక్కడ పోటీ చేయమన్నా సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీని పార్టీ అధిష్టానం ప్రకటించడంతో అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ టీడీపీలోకి చేరారు.