డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జట్లకు ఐసీసీ భారీ జరిమానా..!

లండన్ లోని ఓవల్ వేదికగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో( WTC Final Match ) ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 496 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 270 పరుగులు చేసింది.

 Wtc Final Match Teams Icc Heavy Fine Details, Sports News,cricket News,team Indi-TeluguStop.com

భారత్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసి 209 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది.

డబ్ల్యూటీసి టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియాకు, ఓడిన భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా( ICC Fine on IND and AUS Teams ) విధించింది.

స్లో ఓవర్ రేట్( Slow over rate ) కారణంగా ఇరుజట్లకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు.ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో భారత జట్టు 5 ఓవర్లు, ఆస్ట్రేలియా జట్టు 4 ఓవర్లు స్లో ఓవర్ రేటు నమోదు చేశాయి.

దీంతో భారత జట్టుకు ఫీజులో 100% జరిమానా, ఆస్ట్రేలియా జట్టుకు ఫీజులో 100% జరిమానా విధించింది.దీంతో ఆస్ట్రేలియాకు టైటిల్ సాధించామని సంతోషం పెద్దగా లేకుండా ఐసీసీ భారీగానే షాక్ ఇచ్చింది.

Telugu Cameron Green, Cricket, Iccfine, Iccwtc, Latest Telugu, Shubman Gill, Ind

ఇక ఈ మ్యాచ్ లో శుబ్ మన్ గిల్( Shubman Gill ) కు అదనంగా ఫీజులో 15% జరిమానా విధించింది.అంటే ఇతనికి ఫీజులో 115% జరిమానా విధించబడింది.స్లో ఓవర్ రేటు కారణంగా భారత జట్టు సభ్యులతో పాటు తనకు కూడా 100% జరిమానా విధించింది.అయితే రెండో ఇన్నింగ్స్ లో బోలాంట్ బౌలింగ్లో గిల్ భారీ షార్ట్ ఆడే ప్రయత్నం చేసి కామెరున్ గ్రీన్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు.

ఈ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదమైంది.మ్యాచ్ అనంతరం గిల్ సోషల్ మీడియాలో కామెరున్ గ్రీన్ క్యాచ్ అందుకున్న బంతి నేలను తాకుతూ ఉన్నట్లు ఉండే ఫోటోను పోస్ట్ చేస్తూ, థర్డ్ ఎంపైర్ కు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు అని అర్థం వచ్చేలా రెండు భూతద్దాలు, తలను చేత్తో పట్టుకుంటున్న ఎమోజీలను పోస్ట్ చేసి, అంపైర్ ను విమర్శించాడు.2.7 రూల్ ఉల్లంఘించాడు.ఇందుకు అదనంగా 15% జరిమానా విధించి ఐసీసీ షాక్ ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube