జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 20 సంవత్సరాల కెరియర్లో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో హీరోగా అడుగు పెట్టబోతున్నారు.
ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ తన 20 సంవత్సరాల కెరీర్లో అత్యంత చెత్త రికార్డును కూడా దక్కించుకున్నారు అయితే తన కెరీర్ లో ఇలాంటి రికార్డ్ రావడానికి కారణం రాజమౌళినే అని పరోక్షంగా పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయానికి వస్తే.
ఎన్టీఆర్ 2009వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లి ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఆ ఏడాది విడుదల కావాల్సిన అదుర్స్ సినిమా 2010 సంవత్సరంలో విడుదలైంది.
ఇలా 2009వ క్యాలెండర్ మొత్తం ఎన్టీఆర్ ఏ విధమైనటువంటి సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నారు.ఆ తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా 2018 వ సంవత్సరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరే సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు రాలేదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో బిజీ అయ్యారు.ఇక ఈ సినిమా 2019 వ సంవత్సరంలో పూజా కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు.అయితే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
ఈ క్రమంలోని ఎన్టీఆర్ మరే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కేవలం రాజమౌళి సినిమాకు మాత్రమే పరిమితం అయ్యారు.దీంతో ఎన్టీఆర్ మూడు సంవత్సరాలు ఖాళీగా ఉండటానికి గల కారణం రాజమౌళినే అంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ విధంగా ఎన్టీఆర్ తన 20 సంవత్సరాల కెరియర్లో మూడు సంవత్సరాలు ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా ఉండడం ఇదే మొదటిసారి.ఇలాంటి చెత్త రికార్డ్ ఎన్టీఆర్ 20 సంవత్సరాల కెరియర్లో లేదని చెప్పవచ్చు.ఇకపోతే ఎన్టీఆర్ నటించిన RRR సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ సినిమా విడుదల కాలేకపోయింది.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ మూడు సంవత్సరాలు తీసుకున్న గ్యాప్ ను ఇలా వరుస సినిమాలతో పూర్తి చేయాలని భావించినట్లు తెలుస్తోంది.