ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు డబ్బు సంపాదించడం కోసం ఎంతటి ఘాతుకానికైనా పాల్పడుతున్నారు.కాగా తాజాగా ఓ మహిళ డబ్బు సంపాదించడం కోసం అడ్డు దారులను తొక్కుతూ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే సంధ్య (పేరు మార్చాం) అనే మహిళ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.కాగా చిన్నప్పటి నుంచి సంధ్య పలు ఆర్థిక సమస్యలు మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ చాలా కష్టాలను అనుభవించింది.
దీంతో యవ్వనంలోకి రాగానే తన శరీరాన్ని ఆయుధంగా చేసుకుని డబ్బులు సంపాదించడం మొదలు పెట్టింది.ఈ క్రమంలో డబ్బున్న వ్యక్తులకు వల వేసి వారిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత అందినంతా దోచుకుని వారి నుంచి సపరేట్ అవుతూ వస్తోంది.
ఇలా ఒక పోలీస్ ని మరియు మరో బ్యాంక్ ఉద్యోగిని పెళ్లి చేసుకొని లక్షల రూపాయల సొమ్మును వారి నుంచి భరణంగా తీసుకుంది.అంతటితో ఆగకుండా ఇటీవలే స్థానిక రాష్ట్రంలో మాజీ మంత్రిగా పనిచేసిన ఓ రాజకీయ నాయకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అంతేకాకుండా ఆ రాజకీయ నాయకుడి పేరుని అడ్డం పెట్టుకుని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దాదాపుగా 30 లక్షల రూపాయలు కాజేసింది.అయితే ఇటీవలే ఆ రాజకీయ నాయకుడు ఎన్నికలలో ఓడిపోవడంతో ఉద్యోగం కోసం డబ్బులు కట్టిన వ్యక్తులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.దీంతో సంధ్య మళ్లీ ఆ రాజకీయ నాయకుడితో తెగదెంపులు చేసుకుని మరో డబ్బు ఉన్న వ్యక్తి కోసం వెతక సాగింది.దీంతో సంధ్య మొదటి ఇద్దరు భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంధ్య ని అదుపులోకి తీసుకొని విచారించారు.
దీంతో డబ్బు కోసం తాను నిత్య పెళ్లి కూతురుగా మారినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది.