ప్రపంచంలో వివిధ రకాల మనుషులు ఉంటారు.బతకడం కోసం కొందరు తింటే.
తినడం కోసం కొందరు బతుకుతారు.ఇక ఫుడ్ లవర్స్ అయితే తినే విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు.
ఏది కావాలో.ఎంత కావాలో.
ఓ పక్కా లెక్కతో ఉంటారు.నచ్చింది తినడం కోసం మంచి రెస్టారెంట్ లు ఎక్కడ ఉన్నాయి అంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోతారు.
అది ఎంత దూరం అయినా కూడా లెక్క చేయరు.అయితే ఇంటర్నెట్ వాడకం పెరుతున్న ఈ రోజుల్లో ఫుడ్ కోసం అంత సమయం పెట్టాల్సిన పని తగ్గింది.
స్మార్ట్ గా ఫోన్ లోనే ఎంచక్కా ఆర్డర్ పెట్టుకుంటూ నచ్చింది లాగించేస్తున్నారు.నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టి ఇష్టంగా తినేస్తున్నారు.
ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే.నచ్చింది తినడం కోసం ఓ వ్యక్తి పెట్టిన మెసెజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఫుడ్ కంపెనీ ఎక్స్ట్రా గా ఇచ్చిన ఓ ఆప్షన్ వాళ్ళకు పెద్ద ఫన్నీ ఇన్సిడెంట్ క్రియేట్ అయ్యింది.
ఓ ప్రముఖ పిజ్జా డెలివరీ కంపెనీ తమ కస్టమర్ లకు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు కింద ఎక్స్ట్రా రిక్వెస్ట్ ఆప్షన్ పెట్టింది.దీంతో ఓ పిజ్జా లవర్ చెలరేగిపోయాడు.‘నేను గ్రీన్ మిరియాలు కావాలన్నా అవి అవసరం లేదు.దాని బదులు బనానా మిరియాలు వాడండి.కామెంట్లలో టాప్ కి చేర్చి నన్ను అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకురాకండి’ అంటూ ఓ వ్యాసమే రాశాడు.
ఈ కామెంట్ సెక్షన్ కి అందరికీ విజిబిలిటీ ఉండడంతో అతని మెసేజ్ 64 వేల ఓట్లతో టాప్ అయ్యింది.అంత క్లియర్ గా అతడు పెట్టిన ఆ మెసెజ్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పెప్పర్ సినియో వ్యక్తి మళ్ళీ వచ్చాడు అంటూ క్యాప్షన్ పెట్టాడు.ఇంకేముంది ఈ పోస్ట్ చూసిన ప్రతీ ఒక్కరూ అతడికి పెప్పర్స్ ఫ్రీ గా ఇవ్వండి.ఆర్డర్ సరిగా వెళ్లిందా అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.