భర్తను ఇద్దరు భార్యలు కలిసి పంచుకోవాలని రాజీ కుదిర్చిన పోలీసులు చివరకు..

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి.వీటి కారణంగా తాళి కట్టిన భార్యను కూడా వదిలేయడానికి సిద్దపడుతున్నారు.

 Wives Shared Husband In Ranchi, Wives Shared Husband, Ranchi Man Shared By Wives-TeluguStop.com

భర్తలు మాత్రమే కాదు కొంతమంది భార్యలు కూడా ఇలానే ఉన్నారు భర్త ఎంత మంచివాడైనా పరాయి మహిళ మీద వ్యామోహంతో భర్తను సైతం వద్దనుకుని బయటకు వచ్చే ఆడవాళ్లు కూడా ఉన్నారు.

ఒక వ్యక్తి పెళ్లి అయ్యి భార్య, బిడ్డ కూడా ఉన్నారు.

కానీ ఆ వ్యక్తి పరాయి మహిళపై మోజుతో భార్యను వదిలించుకోవాలనుకున్నాడు.ఆ వ్యక్తికి ఒక యువతీ బాగా నచ్చింది.

ఆ యువతిపై కన్నేసిన ఆ వ్యక్తి ఆమెను ప్రేమలోకి దించాలని పనీపాటా వదిలేసి మరీ ఆమె చుట్టూ తిరిగాడు.చివరకు ఎలాగోలా ఆమెను ప్రేమలో పడేసాడు.

ఆ యువతికి మాయమాటలు చెప్పి తనకు ఇంకా పెళ్లి కాలేదని నమ్మించాడు.ఆ యువతి అతని ప్రేమలో పడి తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ యువకుడితో పారిపోయింది.ఆ వ్యక్తి కూడా తన భార్యతో చెప్పాపెట్టకుండా ఇంట్లో నుండి ఆ యువతితో కలిసి పారిపోయాడు.అతడి భార్య తన భర్త కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆ యువతి తల్లిదండ్రులు కూడా మా కూతురు కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నారు.

ఇక్కడే అసలు కథ ప్రారంభమయ్యింది.పోలీసుల దర్యాప్తులో ఆ భార్యకు అసలు నిజం తెలిసిపోయింది.

దీంతో అతడు అడ్డంగా బుక్కయ్యాడు.చివరకు పోలీసులు కల్పించుకుని సమస్య పరిష్కారం చేసారు.

కానీ కొన్ని రోజుల తర్వాత మరొక సమస్య మొదలయ్యింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

రాంచీకి చెందిన రాజేష్ అనే వ్యక్తి పెళ్లి అయ్యి భార్య ఉండగానే మరొక యువతిపై కన్నేశాడు.అనుకున్నదే తడవుగా ఆ యువతిని ప్రేమలోకి దించి తనకు ఇంకా పెళ్ళి కాలేదని నమ్మించాడు.

ఆ యువతితో కలిసి పారిపోయాడు.భార్య పోలీసులకు భర్త కనిపించడంలేదని ఫిర్యాదు చేయగా ఆమెకు అసలు విషయం తెలిసి షాక్ అయ్యింది.

అతడు మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది.దీంతో మొదటి భార్య భర్తను ఉతికారేసింది.అయితే అతడు ఆ యువతిని పెళ్లి చేసుకుని కాపురం కూడా మొదలు పెట్టడంతో చేసేది ఏమి లేక పోలీసులు మొదటి భార్యతో కలిసి మూడు రోజులు, రెండవ భార్యతో కలిసి మూడు రోజులు, ఒక రోజు రెస్ట్ తీసుకోవాలని పోలీసులు రాజీ కుదిర్చారు.

కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలయ్యింది.

రాజేష్ కొన్నిరోజుల తర్వాత పోలీసులు చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఆ యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.తనను మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా లైంగికంగా కూడా వేధించాడని రాజేష్ పై కేసు పెట్టింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజేష్ ను అరెస్ట్ చేయడానికి వెళితే మొదటి భార్య అతడ్ని తప్పించింది.ప్రస్తుతం అతడిని పట్టుకోవడం కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube