టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రాశిఖన్నా( Rasi Khanna ) టాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే.బాలీవుడ్ సినిమాతో తొలిసారి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి ఖన్నా.
ఆ తర్వాత తెలుగు సిని పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది.మొదట అతిధి పాత్రలో మెప్పించిన ఈ బ్యూటీ.
ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను సొంతం చేసుకుంది.
అయితే టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో కొంతకాలం ఒక వెలుగు వెలిగింది రాశి.
కానీ గత కొన్ని రోజుల నుండి అంతగా అవకాశాలు అందుకోవటం లేదు.అంతేకాకుండా కొత్త హీరోయిన్స్ రాకతో తనను పట్టించుకునే దర్శక నిర్మాతలు కూడా లేరు.
పైగా అవకాశాలు అందుకోవటం కోసం ఈ బ్యూటీ బాగా సన్నబడింది కూడా.ఒకప్పుడు బొద్దుగా ఉండే రాశిఖన్నా ఇప్పుడు మొత్తానికి సన్నబడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇక సన్నబడ్డాక తన అందాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కుర్రాళ్లను చూపులు తిప్పుకోకుండా చేస్తుంది.నిజానికి ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నప్పుడే చాలా క్యూట్ గా ఉండేది.
కానీ సన్నబడ్డాక ఎందుకో అంత అందాన్ని తెచ్చుకోలేకపోయింది అన్నట్లు అనిపించింది.కానీ ఈ మధ్య కాస్త బొద్దుగా తయారవ్వగా కాస్త అందంగా కనిపిస్తుంది.
ఇక ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో అవకాశాల కోసం బాగా ఎదురుచూస్తుంది.కానీ చిన్న చిన్న ప్రాజెక్టులలో మాత్రం అవకాశాలు అందుకుంటుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
కానీ తన అందాలు కేవలం సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితం అయ్యాయని చెప్పాలి.సినిమాలు కాకుండా పలు అడ్వర్టైజ్మెంట్ లలో, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్( Shopping mall openings ) లలో మాత్రమే కనిపిస్తుంది.
ఏ సినిమాలో చూసిన కూడా కొత్త హీరోయిన్స్, బాలీవుడ్ హీరోయిన్స్ తప్ప తను మాత్రం కనిపించడం లేదు.కేవలం తనే కాదు మరి కొంతమంది హీరోయిన్స్ కూడా అవకాశాలు లేకుండా డీలా పడ్డారు.
వాళ్లు కూడా సోషల్ మీడియా కే పరిమితం అవుతున్నారు.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా రాశి ఖన్నా తన ఇన్ స్టా లో ఒక వీడియో పంచుకుంది.అందులో తను మంచి అవుట్ ఫిట్ ధరించి బాగా ఎక్స్పోజ్ చేసింది.అయితే అది గ్లోబల్ స్పా మ్యాగజైన్ ( Global Spa Magazine )కు సంబంధించిన ఫోటోషూట్ అని తెలుస్తుంది.
అయితే ఆ వీడియో చూసిన వాళ్లంతా అందులో తన ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అవుతున్నారు.అందంగా ఉందంటూ చాలా రకాలుగా పొగుడుతున్నారు కానీ మరి కొంతమంది.రాశి ఖన్నా ఇక ఇటువంటి ఫోటోషూట్ లకే పనికొస్తుందా.తనకు సినిమాలలో అవకాశాలు ఇవ్వరా.
ఇక టాలీవుడ్ లో తన పని అయిపోయినట్లేనా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.పాపం రాశిఖన్నా కోసం తన అభిమానులు చాలా బాధపడుతున్నట్లు అర్థమవుతుంది.