ఒక రాజకీయ నాయకుడిగా తనపై వచ్చే విమర్శలపై ఆచి తూచి స్పందిస్తున్న జనసేన అధ్యక్షుడు ఆంధ్ర మంత్రులు తన అన్న చిరంజీవిపై చేసే వ్యాఖ్యలపై మాత్రం ఉగ్రరూపం చూపించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇంతకుముందు కూడా అనేక సందర్బాలలో చిరంజీవిపై చేసిన విమర్శలకు భారీ స్థాయిలో బదులిచ్చిన పవన్ రాజకీయాల్లో కొంతమంది నేతలపై తీవ్ర స్టయి ఆగ్రహం చూపించడానికి వారు ఒకప్పుడు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు ప్రజారాజ్యానికి చేసిన ద్రోహమే కారణం అంటూ విశ్లేషణలు వినిపిస్తూ ఉంటాయి.
కొంతమంది నేతలను జనసేన ఇప్పటికీ దగ్గరకు రానివ్వకపోవడానికి వారు ప్రజారాజ్యానికి చేసిన నష్టమే కారణం అంటూఉంటారు .అప్పటి విషయాలను పవను మర్చిపోలేదని చిరంజీవిని అవమానించిన ప్రతి ఒక్కరిని పవన్ వ్యక్తిగతంగా గుర్తు పెట్టుకుంటారని కూడా అంటారు.
అయితే తన సినిమా వేడుకలో ఒక పెద్ద మనిషి తరహాలో ప్రభుత్వానికి సూచనలు చేసిన చిరంజీవిపై దాడి చేసిన తరహాలో మాట్లాడిన మంత్రులపై పవన్ ఓ రేంజ్ లో ఫైర్ అవ్వబోతున్నారని తెలుస్తుంది.తన వారాహి యాత్రలో ఈ విషయాలు పవన్ హైలెట్ చేస్తారని, చిరంజీవి పై వ్యాఖ్యలు చేసిన మంత్రులపై తీవ్రస్థాయిలో ప్రతి దాడి చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ నుంచి ఈ స్థాయి ప్రతిస్పందన వస్తుందని ఊహిస్తున్న ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే జనసేన మీటింగు పై ఆంక్షలు విధించారని, కార్యకర్తలను అదుపు చేసుకోవాల్సిన బాధ్యత జనసేన దేనిని తేల్చి చెప్పేసారని సమాచారం.అయితే భారీ జన సందోహాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు అని పవన్ మూడో విడత వరాహయాత్ర అనేక సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతుందని ప్రభుత్వంపై పవన్ యుద్ధభేరి మోగిస్తారని వార్తలు వస్తున్నాయి.ఇకపై పరోక్ష విమర్శలు ఉండవని ప్రత్యక్షంగానే ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ దూకుడుగా వెళ్తారని వార్తలు వస్తున్నాయి.