డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth neel ) కేజీఎఫ్ చాప్టర్ 1, 2 సినిమాలతో భారతదేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.తర్వాత సలార్ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
డార్క్ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాలు తీస్తూ ఈ డైరెక్టర్ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో జస్ట్ 4 సినిమాలతోనే దిగ్గజ దర్శకుడిగా ప్రశాంత్ తనదైన ముద్ర వేసుకున్నాడు.
ప్రశాంత్ గొప్పతనం ఏంటంటే అతను ఇప్పటివరకు తీసిన 4 సినిమాలు కూడా సెన్సేషనల్ హిట్స్‌గా నిలిచాయి.సాధారణంగా దర్శకులు సినిమాల మీద విపరీతమైన పిచ్చితో ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటారు.
ప్రశాంత్ మాత్రం వీరందరికీ విరుద్ధం.అతడు కేవలం డబ్బులు సంపాదించడానికే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఆ తర్వాత డైరెక్షన్ పై బాగా మక్కువ పెరిగి ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాడు.

ప్రశాంత్ తీసిన మొదటి సినిమా ఉగ్రం( Ugramm ) ఇందులో హీరోగా శ్రీ మురళి చేశాడు.మురళి ప్రశాంత్‌కు బావ అవుతాడు.ప్రశాంత్ నీల్ సొంత చెల్లి అయిన విద్యాను శ్రీ మురళి వివాహం చేసుకున్నాడు.
ప్రశాంత్ నీల్ కర్ణాటకలో పుట్టి పెరిగినప్పటికీ అతని పూర్వీకులు మాత్రం ఏపీలోని మడకశిర సమీపంలోని నీలకంఠాపురంలో నివసించారు.ఏపీ రాజకీయాల్లో రాణిస్తున్న వారితోనూ ప్రశాంత్ నీల్ కి దగ్గరి సంబంధాలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ లీడర్ రఘువీరారెడ్డి ప్రశాంత్‌కు చిన్నాన్న అవుతారు.

ఇక అసలు విషయానికొస్తే, ఉగ్రం సినిమాని ప్రశాంత్ నీల్ సోదరుడు ప్రదీప్ నీల్( Pradeep Neel ) ప్రొడ్యూస్ చేశాడు.నిజానికి ప్రశాంత్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కావలసిన డబ్బును సమకూర్చుకోవడానికి తనకెంతో ఇష్టమైన ఇల్లును అమ్మిశాడు.ఈ సినిమా బడ్జెట్ రూ.4 కోట్లు.అతడికి అప్పటికీ ఎలాంటి అనుభవం లేదు.
ఏదైనా తేడా వస్తే ఆర్థికంగా అతడి పరిస్థితి దారుణంగా మారే రిస్క్ ఉంది.అయినా ప్రశాంత్ ధైర్యం చేశాడు.
తన ప్రతిభతో డబ్బులను సంపాదించవచ్చని నమ్మాడు, ఇంటిని అమ్మేసి కష్టపడి సినిమా తీశాడు.అతడి కష్టానికి ఊహించని దానికంటే ఎక్కువ ఫలితమే వచ్చింది.ఈ సినిమారూ.30 కోట్లు వసూలు చేసి అతడికి చాలా లాభాలను తెచ్చి పెట్టింది.అయితే ప్రశాంత్ చదువులో మాత్రం ఎప్పుడూ రాణించేవాడు కాదు.ముఖ్యంగా మ్యాథ్స్ లో అతనికి చాలా తక్కువ మార్కులు వచ్చేవి.ప్రశాంత్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు.అయినా కూడా అద్భుతమైన సినిమాలను తీస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు.