2023లో బ్లాక్‌బస్టర్ అందుకున్న న్యూ డైరెక్టర్స్.. ఆ దర్శకుడైతే సెన్సేషనల్ హిట్ కొట్టాడు..

టాలివుడ్ ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం కొత్త దర్శకులు అడుగుపెడుతూనే ఉన్నారు.వారిలో కొందరు తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటూ ఆశ్చర్య పరుస్తున్నారు.2023లో కూడా కొత్త దర్శకులు అడుగుపెట్టి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి తమదైన ముద్ర వేసుకున్నారు.వారెవరో తెలుసుకుందాం పదండి.

 Tollywood Debue Directors In 2023 , Shanmukha Prashanth, Venu Yeldandi, Srikant-TeluguStop.com

కమెడియన్ కమ్‌ యాక్టర్ వేణు యెల్దండి( venu yeldandi ) బలగం సినిమాతో దర్శకుడిగా ఈ ఏడాది పరిచయమయ్యాడు.బలగం మూవీ మూడు కోట్లతో తీస్తే రూ.26 కోట్లు వసూలు చేసి బంపర్ హిట్ గా నిలిచింది.

రైటర్ పద్మభూషణ్ సినిమాతో షణ్ముఖ ప్రశాంత్( Shanmukha Prashanth ) వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు.

సుహాస్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా చాలా తక్కువ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దసరా సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టాడు.

అతడికి ఇదే తొలి సినిమా అని ఎవరూ నమ్మలేకపోయారు.అంత బాగా డైరెక్ట్ చేశాడు.

కీర్తి సురేష్ ఇందులో డాన్స్ అదరగొట్టేసింది.పెట్టిన బడ్జెట్‌కు రెట్టింపు స్థాయిలో ఈ సినిమా వసూలు చేసింది.

Telugu Debue Directors, Shauryu, Srikanth Odela, Tollywood, Venu Yeldandi, Young

యంగ్ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్( Young director Sumanth Prabhas ) మేమ్‌ ఫేమస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో అతడే హీరోగా నటించి అతడే డైరెక్ట్ చేశాడు.తొలి సినిమాతోనే తన అసాధారణ ప్రతిభను కనబరిచాడు.

యూత్‌ఫుల్ కామెడీ డ్రామా “మ్యాడ్”తో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

యుత్ మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది.యంగ్‌స్టర్స్‌ దీనిని బాగా ఆదరించడం వల్ల అతడు తొలి సినిమాతోనే ఒక హిట్ అందుకున్నాడు.

Telugu Debue Directors, Shauryu, Srikanth Odela, Tollywood, Venu Yeldandi, Young

“హాయ్ నాన్న” సినిమా తీసింది కూడా కొత్త దర్శకుడు.శౌర్యువ్( Shauryu ) డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి ఎమోషనల్ కంటెంట్ తో హిట్ అందుకుంది.ఈ సంవత్సరం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత నానికే దక్కుతుంది.వారిద్దరూ కూడా మంచి ప్రతిభావంతులే కావడం విశేషం.

మరి 2024 సంవత్సరంలో కొత్తగా ఏ దర్శకులు పరిచయమవుతారో చూడాలి.వారు ఎలాంటి సెన్సేషనల్ హిట్స్ కొడతారో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.

ఈ సంవత్సరం దర్శకులతో పాటు కొత్త హీరోయిన్లు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.వారు కూడా సెన్సేషనల్ హిట్స్ తమ ఖాతాలో వేసుకొని ఆశ్చర్యపరిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube