వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పార్టీని ప్రారంభించి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఏడాది కాలంగా ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తూ.
ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడుతు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఆమె విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తువచ్చారు.
ఆమె అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆమెను ఏనాడూ సీరియస్‌గా తీసుకోలేదు. ఆమె వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నాయకులు ఎప్పుడూ తీవ్రంగా స్పందించలేదు.
అయితే ఆమె పాదయాత్ర దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో కేసీఆర్, ఆయన పార్టీ నేతలు షర్మిల పాదయాత్రను,
ఆమె వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆమె విమర్శల్లో అంత ఘాటు ఏమీ లేకపోయినా ఆమె చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు.
ఆమె కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేయడం, ఆమె కార్వాన్‌ను దగ్ధం చేయడం వంటివి చాలా ఆశర్భాన్ని కలిగిస్తున్నాయి.మరియు మంగళవారం దాడిలో ధ్వంసమైన కారులో ప్రగతి భవన్‌కు ముట్టడికి వెళ్ళగా ఆమెను పోలీసులు అవమానకర రితిలో స్టేషన్ తరిలించారు.
షర్మిల కారు దిగి దిగేందుకు నిరాకరించడంతో పోలీసులు క్రేన్‌ను తీసుకొచ్చి కారుతో పాటు ఆమెను లాక్కెళ్లారు.

దివంగత నేత కూతురు విషయం ఇలా ఉంటే ప్రస్తుత ముఖ్య మంత్రి కేసీఆర్ కూతరు వార్తల్లో హైలెట్‌గా నిలిచారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు కవిత పేరును చేర్చారు.అమిత్ అరోరా సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ఈడీ అధికారులు బయటపెట్టారు.
సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించినట్టుగా పేర్కొన ఈడీ ఈ వ్వవహారంలో వైసీపీ ఎంపీ మాగుంట, శరత్ రెడ్డి, కవిత కీలక వ్వక్తులని ఈడీ తెలిపింది.వాంగ్మూలంలో అమిత్ అరోరా ఈ విషయాన్ని ధ్రువీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది.దీంతో ఇద్దరూ కీలక నేతల కూమార్తెలు వార్తల్లో నిలిచారు.