త్రివిక్రమ్ చిరంజీవి కాంబోలో రావాల్సిన సినిమా ఎందుకు అగిపోయిందంటే..?

మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఉంటుంది.ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులకి, డైరెక్టర్స్ కి చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి.

 Why Did Trivikram Chiranjeevi Combo's Movie Get Delayed ,trivikram, Chiranjeevi,-TeluguStop.com

ఆయన చేసిన సినిమాలని చూసి మనం కూడా సినిమా చేయాలి అని ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు.

అయితే చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని మళ్ళీ సినిమాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలి అని అనుకుంటున్నప్పటికి అది ఎప్పటికీ అప్పుడు వాయిదా పడుతూ వస్తుంది…మొన్నటికి మొన్న రామ్ చరణ్, బోయపాటి కాంబో లో వచ్చిన వినయ విదేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవి మాట్లాడుతూ త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు

 Why Did Trivikram Chiranjeevi Combo's Movie Get Delayed ,Trivikram, Chiranjeevi,-TeluguStop.com
Telugu Boyapati Combo, Chiranjeevi, Jai Chiranjeeva, Ram Charan, Trivikram-Movie

అలాగే త్రివిక్రమ్ కూడా ఆ ఫంక్షన్ కి వచ్చి ఆ విషయం నిజమే అన్నట్టు చెప్పారు.కానీ ఈ విషయం మీద ఆ తర్వాత ఒక్క అప్డేట్ కూడా రాలేదు అయితే చిరంజీవి వరుసగా సినిమాలా మీద సినిమాలు కమిట్ అవ్వడం తో వీళ్లిద్దరి ప్రాజెక్ట్ అనేది లేట్ అవుతూ వచ్చింది.అలా ఈ ప్రాజెక్ట్ చాలా వరకు లేట్ అవుతుంది.ఎప్పుడో ఒకసారి మొత్తానికి అయితే ఈ కాంబో లో సినిమా ఉంటుంది ఉంటుంది కానీ అది ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు…

Telugu Boyapati Combo, Chiranjeevi, Jai Chiranjeeva, Ram Charan, Trivikram-Movie

త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు చిరంజీవి తో చేసిన జై చిరంజీవ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది, అయినప్పటికి చిరంజీవి కామెడీ టైమింగ్ మాత్రం ఆ సినిమా లో అద్బుతం గా ఉంటుంది.అలా చిరంజీవి తో రైటర్ గా ఒక సినిమా చేసినప్పటికీ డైరెక్టర్ గా ఒక సారి చిరంజీవి ని డైరెక్ట్ చేయాలని చూస్తున్నాడు…

ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమా షూటింగ్ లో ఉన్నాడు ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఇంకా క్లారిటీ లేదు.అలాగే చిరంజీవి భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా పూర్తి అయితే నెక్స్ట్ ఎవరితో సినిమా అనేది ఒక క్లారిటీ వస్తుంది…త్రివిక్రమ్, చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలి అని ఇప్పటికే చిరంజీవి ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు మరీ ఈ కాంబో సినిమా రావాలని మనం కూడా కోరుకుందాం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube