త్రివిక్రమ్ చిరంజీవి కాంబోలో రావాల్సిన సినిమా ఎందుకు అగిపోయిందంటే..?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఉంటుంది.
ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులకి, డైరెక్టర్స్ కి చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి.
ఆయన చేసిన సినిమాలని చూసి మనం కూడా సినిమా చేయాలి అని ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు.
అయితే చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని మళ్ళీ సినిమాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలి అని అనుకుంటున్నప్పటికి అది ఎప్పటికీ అప్పుడు వాయిదా పడుతూ వస్తుంది.
మొన్నటికి మొన్న రామ్ చరణ్, బోయపాటి కాంబో లో వచ్చిన వినయ విదేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవి మాట్లాడుతూ త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు """/"/
అలాగే త్రివిక్రమ్ కూడా ఆ ఫంక్షన్ కి వచ్చి ఆ విషయం నిజమే అన్నట్టు చెప్పారు.
కానీ ఈ విషయం మీద ఆ తర్వాత ఒక్క అప్డేట్ కూడా రాలేదు అయితే చిరంజీవి వరుసగా సినిమాలా మీద సినిమాలు కమిట్ అవ్వడం తో వీళ్లిద్దరి ప్రాజెక్ట్ అనేది లేట్ అవుతూ వచ్చింది.
అలా ఈ ప్రాజెక్ట్ చాలా వరకు లేట్ అవుతుంది.ఎప్పుడో ఒకసారి మొత్తానికి అయితే ఈ కాంబో లో సినిమా ఉంటుంది ఉంటుంది కానీ అది ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు.
"""/"/
త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు చిరంజీవి తో చేసిన జై చిరంజీవ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది, అయినప్పటికి చిరంజీవి కామెడీ టైమింగ్ మాత్రం ఆ సినిమా లో అద్బుతం గా ఉంటుంది.
అలా చిరంజీవి తో రైటర్ గా ఒక సినిమా చేసినప్పటికీ డైరెక్టర్ గా ఒక సారి చిరంజీవి ని డైరెక్ట్ చేయాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమా షూటింగ్ లో ఉన్నాడు ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఇంకా క్లారిటీ లేదు.
అలాగే చిరంజీవి భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా పూర్తి అయితే నెక్స్ట్ ఎవరితో సినిమా అనేది ఒక క్లారిటీ వస్తుంది.
త్రివిక్రమ్, చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలి అని ఇప్పటికే చిరంజీవి ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు మరీ ఈ కాంబో సినిమా రావాలని మనం కూడా కోరుకుందాం.
అలసిపోయారా.. ఇక్కడ వెయిట్రెస్ ఒడిలో హాయిగా పడుకోవచ్చు.. 20 నిమిషాలకు రేటెంతంటే..!