Mudragada Pawan Kalyan : అటు ముద్రగడ.. ఇటు పవన్ ! ఇంతకీ కాపులు ఎటు వైపు ? 

రోజురోజుకు ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ఈనెల 14వ తేదీన కాపు ఉద్యమ నేత ,మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) వైసీపీలో చేరబోతున్నారు.

 Whom Will Kapu Category Voters Support Pawan Kalyan Or Mudragada Padmanabham-TeluguStop.com

వాస్తవంగా ముందుగా ఆయన జనసేన పార్టీలో చేరాలని భావించారు.స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని ముద్రగడ ఎదురు చూశారు.

కానీ పవన్ మాత్రం ముద్రగడను చేర్చుకునే విషయంలో అంత ఆసక్తి చూపించలేదు.మరోవైపు చూస్తే ఎన్నికల సమయం దగ్గర పడింది .ఈ నేపథ్యంలో తానతో పాటు,  తన కుమారుడు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముద్రగడ వైసీపీలో( YCP ) చేరాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడ నివాసానికి వెళ్లి మరి ఆయనను ఆహ్వానించారు .

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janansenani, Janasena, Kapu, Kapu Ca

ముద్రగడ వైసీపీలో చేరడం దాదాపు ఖాయం అయింది.ఈ నెల 14 న ఆయన వైసీపీ లో చేరుతున్నారు.ఇక జనసేన ,టిడిపి తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో , కాపు సామాజిక వర్గం( Kapu Social Category ) ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.సినీ నటుడుగానే కాకుండా,  కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు పవన్ కళ్యాణ్.

ముఖ్యంగా కాపు యువత అంతా పవన్ ను దైవంగానే చూస్తున్నారు.పవన్ ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా పవన్ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాలనే సిద్ధాంతంతోనే చాలామంది ఉన్నారు.

ఒకవైపు పవన్ కు ఉన్న క్రేజ్ కు జనసేనకు 21 సీట్లు మాత్రమే కేటాయించడం పై టిడిపి పై ఆగ్రహం ఉన్నా , జగన్ ను ఓడించడమే తన లక్ష్యం అని , మిగతా సంగతి తర్వాత అని పవన్ ప్రకటించడంతో పవన్ నిర్ణయాన్ని కాపు యువత అర్థం చేసుకున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janansenani, Janasena, Kapu, Kapu Ca

ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అంతా జనసేనకు ,( Janasena ) ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టిడిపి, బీజేపీ  కి మద్దతు ఇస్తారు అనడంలో సందేహం లేదు.  కానీ పాత జనరేషన్ కాపులు మాత్రం ముద్రగడ పద్మనాభం వెంట నడిచే అవకాశం ఉంది.ఎందుకంటే పవన్ ను ముఖ్యమంత్రి కానప్పుడు పరోక్షంగా చంద్రబాబును( Chandrababu Naidu ) ముఖ్యమంత్రి చేయాలనుకున్నడు పాత జనరేషన్  జనసేనకు మద్దతు ఇచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

  ముద్రగడ ఎప్పటి నుంచో కాపు రిజర్వేషన్ అంశంపై పోరాటాలు చేయడం,  నిజాయితీపరుడుగా పేరు ఉండడం వంటివి ఆ సామాజిక వర్గం లోను ఆయన పై కాస్త సానుకూలత ఉండేలా కనిపిస్తుంది.మొత్తంగా చూస్తే కాపులు రెండు గా చీలే అవకాశం ఎక్కువగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube