సీనియర్ నటి భూమిక ( Bhumika ) అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు.మరీ ముఖ్యంగా ఖుషి సినిమాలో ఈమె నడుము కు ఎంత మంది ఫ్యాన్స్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ సినిమాతో భూమిక కి యూత్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇక ఈ సినిమా ఇప్పటికి వచ్చినా కూడా భూమిక నడుము సీన్ చూడడానికి చాలామంది ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.అలాంటి భూమిక ప్రస్తుతం సినిమాల్లో రియంట్రీ కోసం ఎదురుచూస్తుంది.ఇక ఆ మధ్య కాలంలో వచ్చిన ఎంసీఏ సినిమాలో నానికి వదినగా చేసింది.
ఇక ఈమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎందరో స్టార్ హీరోల సరసన కూడా నటించింది.అంతేకాదు ఈమె కొంతమంది హీరోలకు అదృష్టంగా కూడా చెప్పవచ్చు.
ఎందుకంటే ఈమె నటించిన సినిమాల వల్ల కొంతమంది హీరోలు స్టార్లు అయ్యారు.ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది.
అలాంటి భూమిక సినిమాల్లో అవకాశాలు తగ్గాక భరత్ ఠాకూర్ ( Bharath thakur ) అనే యోగా టీచర్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే పెళ్లి చేసుకున్న కొత్తలో వీళ్ళిద్దరూ బాగానే ఉన్నప్పటికీ తర్వాత మళ్లీ భూమికకు సినిమాలపై ఆసక్తి పెరిగిందట.
కానీ నటిగా కాకుండా నిర్మాతగా మారుతాను అని తన భర్త తో చెప్పిందట.అయితే తన భర్త మాత్రం అందుకు అంగీకరించలేదట.మన దగ్గర ఉండే డబ్బుతో సినిమాలను ప్రొడ్యూస్ చేయలేము అని చెప్పాడట.అయినప్పటికీ వినకుండా తన భర్తతో బలవంతంగా ఓ సినిమాకి పెట్టుబడి పెట్టించిందట.
ఇక భూమిక ( Bhumika ) నిర్మాతగా చేసిన ఆ సినిమా అట్టర్ ప్లాఫ్ అవ్వడంతో పెట్టిన బడ్జెట్ మొత్తం పోయింది.
అలా డబ్బుల విషయంలో భార్యాభర్తలిద్దరికీ గొడవలు వచ్చాయట.అంతేకాదు ఒకానొక సమయంలో భరత్ ఠాకూర్ భూమిక మధ్య ఉండే విభేదాలు మరింత తీవ్రతరం అవడంతో విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారట.ఇక వీరి గురించి ఈ విషయం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించడంతో వీరి మధ్య ఉండే మనస్పర్ధలు తొలగించి మళ్లీ వీరిని కలిపేందుకు ఇండస్ట్రీలో ఉండే నాగార్జున( Nagarjuna ) దాసరి నారాయణరావు వంటి వాళ్ళు నచ్చజెప్పారట.
వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇద్దరి మధ్య ఉండే గొడవలను సాల్వ్ చేసి మళ్లీ భూమిక జీవితాన్ని బాగు చేశారట.