బాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నమ్రత ( Namratha ) టాలీవుడ్ కి వచ్చి మహేష్ బాబుతో వంశీ సినిమాలో నటించింది.ఇక ఈ ఒకే ఒక్క సినిమాతో మహేష్ బాబు అందానికి పడిపోయిందని చెప్పవచ్చు.
వంశీ( Vamshi ) సినిమా షూటింగ్ టైంలో నమ్రత మహేష్ బాబు తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.ఇక వీరి పెళ్లికి నమ్రత ) ఫ్యామిలీ ఒప్పుకున్నప్పటికీ మహేష్ బాబు( Mahesh babu) ఫ్యామిలీ మాత్రం మొండికేసింది.
కృష్ణ మాత్రం మా ఇంటికి నమ్రత కోడలుగా వద్దే వద్దు అని భీష్ముంచుకుకూర్చున్నారు.కానీ కొన్ని సంవత్సరాలకి ఇందిరాదేవి అలాగే మంజుల (Manjula) ఇద్దరు కృష్ణకు నచ్చజెప్పడంతో నమ్రత ని తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి కృష్ణ ( Krishna ) అంగీకరించారు.
అయితే కృష్ణ నమ్రత ని తన ఇంటి కోడలుగా ఒప్పుకోకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి.అదేంటంటే నమ్రత కి అప్పటికే ఇండస్ట్రీలో వేరే హీరోలతో ఎఫైర్ వార్తలు వినిపించాయి.
ఈ కారణంతోనే నమ్రతని మహేష్ బాబు కి భార్యగా వద్దని చెప్పారు.అయితే నమ్రత మహేష్ బాబు కంటే ముందు ఏ హీరోతో ప్రేమాయణం సాగించిందో ఇప్పుడు తెలుసుకుందామా.
నమ్రత మహేష్ బాబు కంటే ముందే బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్(Sanjay Dutt ) తో ప్రేమలో పడిందట.అవును అప్పటి ఇండస్ట్రీలో వినిపించిన వార్తల ప్రకారం సంజయ్ దత్ తో కలిసి నమ్రత వాస్తవ్( Vaasthav ), కార్గిల్( Karil ) వంటి సినిమాల్లో నటించింది.అయితే సినిమా ఇండస్ట్రీలో ఒకే హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో వరుసగా చేస్తే వారి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం జరగడం కామన్.
అయితే అప్పట్లో వీరి మధ్య ఈ ప్రచారం జరగడానికి ఇది కూడా ఒక కారణమేనట అంతేకాకుండా సంజయ్ దత్ తో ఓ సినిమాలో నటించేటప్పుడు ఘాటు రొమాన్స్ చేసింది నమ్రత.ఇక ఈ సినిమా విడుదలయ్యాక వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అంటూ ఒక వార్త పుట్టుకొచ్చింది.మరి ఇందులో ఉన్నది ఎంత నిజమో కానీ అప్పట్లో వీరు మధ్య ఎన్నో ఎఫైర్ వార్తలు వినిపించాయట.
ఇక మహేష్ బాబు ని పెళ్లి చేసుకొని దాదాపు 20 ఏళ్ళు దగ్గర పడుతున్నప్పటికీ కూడా నమ్రత మీద ఎలాంటి రూమర్ కూడా లేదు.ఎంతో చక్కటి ఇల్లాలుగా గుర్తింపు తెచ్చుకుంది.