ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు సీఎం కేసీఆర్ చేసిన అన్యాయం ఏంటని ప్రశ్నించారు.
ఓడిపోయిన తుమ్మలకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయడం అన్యాయమా అని నిలదీశారు.ఐదేళ్లు మంత్రిగా జిల్లాను అప్పచెబితే జిల్లాలో ఒక్క సీటు గెలవలేదని, తుమ్మల గెలవలేకపోయారని విమర్శించారు.
అనంతరం షర్మిల వ్యవహారంపై స్పందించిన ఉపేందర్ రెడ్డి ఆమె తెలంగాణ కోడలు ఎలా అవుతుందని ప్రశ్నించారు.షర్మిల రెండేళ్లుగా ఏం చెప్పిందన్న ఆయన ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు.