రైల్వేస్టేషన్లలో ఉచితంగా ఇంటర్నెట్.. ఫ్రీగా ఎలా వాడుకోవాలంటే..?

రైల్వే స్టేషన్లలో( railway stations ) ఉచితంగా వైఫై సౌకర్యం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.దాదాపు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ ఫ్రీ వైఫై( Free WiFi ) సౌకర్యాన్ని రైల్వేశాఖ ప్రయాణికులకు కల్పిస్తోంది.

 How To Use Free Internet In Railway Stations, Railway Station, Free Internet, Te-TeluguStop.com

అయితే 30 నిమిషాలు మాత్రమే ఈ ఉచిత వైఫై సౌకర్యాన్ని ప్రయాణికులు పొందవచ్చు.దీని కోసం మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది.

ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు వైఫై కనెక్షన్ యాక్టివేట్ అవుతుంది.కేవలం అరగంట మాత్రమే వైఫైను మీరు ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.

ఆ తర్వాత వాడుకోలంటే రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

Telugu Benefits, Rail Passengers, Railway, Tech-Latest News - Telugu

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 6,108 రైల్వేస్టేషన్లలో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది.దీని ద్వారా అరగంట పాటు హైస్పీడ్ ఇంటర్నెంట్ ను ఫ్రీగా ప్రయాణికులు వాడుకోవచ్చు.రైల్ టెల్, రైల్ వైర్ పేరుతో రైల్వేశాఖ ఈ ఉచిత వైఫై సేవలను అందిస్తోంది.

గూగుల్ తో కలిసి రైల్ టెల్ సంస్థ ( RailTel Corporation )ఈ సేవలను అందిస్తోంది.అరగంట పాటు ఉండే ఈ ఉచిత ఇంటర్నెట్ లో 1ఎంబీపీఎస్ వరకు డేటా స్పీడ్ ఉంటుంది.

అరగంట తర్వాత వాడుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఇందుకుగాను అనేక ఇంటర్నెట్ ప్యాకేజీలను రైల్ వైర్ అందిస్తోంది.రూ.10 నుంచి ఈ ఇంటర్నెట్ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి.

Telugu Benefits, Rail Passengers, Railway, Tech-Latest News - Telugu

ప్యాకేజీ వ్యాలిడిటీ ఒకరోజు వరకు ఉంటుంది.34ఎంబీపీఎస్ హైస్పీడ్ 5జీబీ డేటా మీరు పొందుతారు.అయితే ఉచిత వైఫైను యాక్స్ చేయాలంటే ముందుగా మీ ఫోన్ లో వైఫై ఆన్ చేయాలి.ఆ తర్వాత వైఫై సెట్టింగ్ లో వెళ్లి రైల్ వైర్ నెట్ వర్క్ ను సెలక్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్రౌజర్ లో ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది.అందులో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.ఆ తర్వాత ఫోన్ కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది.స్టేషన్ ప్రాంగణాల్లో మాత్రమే ఈ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube