ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప 2 ( Pushpa 2 )గురించి భారీ చేర్చ జరుగుతుంది.అయితే ఈ సినిమా ఆగస్ట్ 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఎందుకంటే ఈ సినిమా కోసం ప్రతి ఒక్క అభిమాని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు.
ఇక మొదటి పార్ట్ అయిన పుష్ప సినిమా( Pushpa movie ) ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే.
అయితే దాని ద్వారానే ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే పెరుగుతున్నాయి.ఇక ముఖ్యంగా బాలీవుడ్( Bollywood ) లో అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ ని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవి శ్రీ ప్రసాద్( Devi Shri Prasad ) తెలియ జేశాడనే చెప్పాలి.
అది ఏంటి అంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి ‘నేషనల్ అవార్డ్’ వచ్చింది.ఇక పుష్ప 2 సినిమాలో అంతకు మించి తన నటన ఉండబోతున్నట్టుగా కూడా తను ఒక హింట్ అయితే ఇచ్చాడు.
ఇక మొత్తానికైతే పుష్ప 2 సినిమాతో మరోసారి అల్లు అర్జున్( Allu Arjun ) ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ను సంపాదించుకుంటాడు అని దేవి శ్రీ ప్రసాద్ చెప్పడం విశేషం.
మరి ఆయన చెప్పినట్టుగానే మరోసారి అల్లు అర్జున్ తన నటన తో మ్యాజిక్ చేసి నేషనల్ అవార్డుని అందుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇక తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ ను కూడా సినిమా మేకర్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.