వరుస కేసులు, పైగా మంచు తుఫాన్.. ప్రతికూల పరిస్ధితుల్లోనూ అయోవాలో ట్రంప్ బంపర్ విక్టరీ

త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.కానీ వరుస వివాదాలు, కోర్టు విచారణలు, పదుల సంఖ్యలో సివిల్ క్రిమినల్ కేసులతో ట్రంప్ ఎన్నో ఇబ్బందుల్లో వున్నారు.

 Watch How The Voters Celebrated Trump Victory Amid Big Chill In Iowa Caucus Deta-TeluguStop.com

కానీ ఓటర్లు తన వైపే వుంటారని , రిపబ్లికన్ పార్టీపై( Republican Party ) తన గ్రిప్ తగ్గలేదని ఆయన నమ్ముతూ వచ్చారు.అందుకే రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ డిబేట్‌కు సైతం ఆయన దూరంగా వుంటున్నారు.

ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ సర్వేల్లో, ముందస్తు ఓపీనియన్ పోల్స్‌లో ట్రంప్ అగ్రస్థానంలో వుంటూ వస్తున్నారు.తాజాగా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధిని( Presidential Candidate ) ఎన్నుకునే అంశానికి సంబంధించి అయోవా కాకసస్‌తో ఈ ప్రక్రియ మొదలైంది.

Telugu Donald Trump, Donaldtrump, Iowa Caucus, Iowa Caucuses, Nikki Haley, Repub

ప్రైమరీలో అత్యంత కీలకమైన అయోవా కాకసస్( Iowa Caucuses ) ఎన్నికల్లో ట్రంప్ బంపర్ విక్టరీ సాధించారు.ఏకంగా 51 శాతం ఓట్లు ఆయనకు పోలయ్యాయి.వివేక్‌కు( Vivek Ramaswamy ) కేవలం 7.7 శాతం ఓట్లు పోలయ్యాయి.అలాగే ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్( Ron Desantis ) 21.2 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలవగా.భారత సంతతికే చెందిన నిక్కీ హేలీకి( Nikki Haley ) 19.1 శాతం ఓట్లు వచ్చాయి.అయోవాలో ప్రస్తుతం తీవ్రమైన మంచు తుఫాను వుండగా.ప్రతికూల వాతావరణ పరిస్ధితులను సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం.రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధిని ఎన్నుకునే అంశానికి సంబంధించి అయోవా కాకసస్‌తో ఈ ప్రక్రియ మొదలవ్వగా.జనవరి 23న న్యూహాంప్‌షైర్‌లో తదుపరి ఎన్నిక జరగనుంది.

Telugu Donald Trump, Donaldtrump, Iowa Caucus, Iowa Caucuses, Nikki Haley, Repub

తొలి పోలింగ్‌లోనే ఘన విజయం సాధించడం ద్వారా .రిపబ్లికన్ పార్టీపై తన పట్టు ఏమాత్రం తగ్గలేదని డొనాల్డ్ ట్రంప్ నిరూపించారు.ఈ విజయంతో ట్రంప్ మద్ధతుదారులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.ఆయనకు అభినందనలు తెలిపేవారితో సోషల్ మీడియా నిండిపోయింది.డొనాల్డ్ ట్రంపే రిపబ్లికన్ అభ్యర్ధిగా వుంటారని, నవంబర్‌లో వైట్‌హౌస్‌ను తిరిగి దక్కించుకుంటారని పలువురు జోస్యం చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube