గ్రౌండ్‌లో రిజ్వాన్ న‌మాజ్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు సారీ చెప్పిన వ‌కార్ యూనిస్‌

మొన్న జ‌రిగిన టీమ్ ఇండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్ ఎంత‌లా హాట్ టాపిక్ అయిందో అంద‌రికీ తెలిసిందే.మామూలుగానే క్రికెట్ అంటే మ‌న దేశంలో విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది.

 Waqar Younis Apologizes For Comments On Rizwan Namaz On The Ground, Waqar Younis-TeluguStop.com

అలాంటిది ఇక దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఆ క్రేజ్ వేరే లెవ‌ల్ క‌దా.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పాకిస్తాన్‌ మీద గెలిచి పంతం నెగ్గించుకోవాల‌ని స‌గ‌టు క్రికెట్ అభిమాని ద‌గ్గ‌రి నుంచి ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు.

అయితే గ‌త మ్యాచ్ మాత్రం అంద‌రికీ నిరాశే మిగిల్చింది.ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ విక్ట‌రీ కొట్టేసింది.

కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఘ‌ట‌న ఇప్ప‌డు సంచ‌ల‌నంగా మారింది.

అదేంటంటే ఓపెన‌ర్ మ‌హ‌హ్మద్ రిజ్వాన్ ఆట మ‌ధ్య‌లో గ్రౌండ్‌లోనే అంద‌రూ చూస్తుండ‌గా న‌మాజ్ చేసిన విష‌యం విదిత‌మే.

అయితే అత‌ను ఇలా అంద‌రి మ‌ధ్య‌లో న‌మాజ్ చేయ‌డంలో పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ అయిన వకార్ యూనిస్ కొన్ని వివాదాస్ప‌ద కామెంట్లు చేశాడు.అదేంటంటే ఇండియ‌న్ ప్లేయర్లు అంటే హిందూ ప్లేయ‌ర్లు కాబ‌ట్టి వారి ఎదుట అలా రిజ్వాన్ న‌మాజ్ చేయ‌డం త‌న‌కు ఎంతో ప్ర‌త్యేకంగా అనిపించిందంటూ కామెంట్ చేశాడు.

అయితే దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

Telugu Cricket, Harsha Bhogle, Ind Pak Cup, Pakistanfast, Rizwan Namaz, Waqar Yo

దీనిపై ఫేమ‌స్ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా రియాక్ట్ అయ్యాడు.క్రికెట్ అనేది మ‌తాల‌కు అతీతం అని వకార్ లాంటి స్టార్ బౌల‌ర్ ఇలాంటి కామెంట్లు చేయ‌డం మంచిది కాదంటూ చెప్పాడు.ఆటల్లో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు స్థానం లేదంటూ వ్యాఖ్యానించాడు.

క్రికెట్‌కు ఆద‌ర్శంగా ఉన్న వారు ఇలాంటివి మాట్లాడ‌కూడ‌ద‌ని సూచించాడు.క్రికెట్ ను మతంతో విభజించ‌డం మంచిది కాద‌ని సూచించాడు.

కాగా ఇలా వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై వకార్ యూనిస్ వెనక్కి స్పందించాడు.త‌న మాట‌ల‌ను వెన‌క్కు తీసుకుంటున్నాన‌ని, అంద‌రికీ క్షమాపణలు అంటూ ట్వీట్ చేయ‌డంసంచ‌ల‌నంగా మారింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube