మీరు కొత్తగా బైక్ లేదంటే స్కూటర్ ఫైనాన్స్( Scooter Finance ) లో కొనాలని అనుకుంటున్నారా? అయితే మీ దగ్గర కనీస డౌన్ పేమెంట్ కూడా లేదా? అయితే మీకు శుభవార్త.మీకోసం ఇపుడు అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది.
అవును, మీరు జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా తీయకుండానే 100 శాతం ఫైనాన్స్‌తో మీరు బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయొచ్చు.ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్( Company Bajaj Finance ) కస్టమర్లకు ఇపుడు 100 శాతం ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తోంది.అదే బంపర్ ఆఫర్ అనుకుంటే, బైక్ లేదా స్కూటర్ కొనుగోలుపై రూ.5వేల వరకు క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది.

సూపర్ ఆఫర్ కదూ.మరెందుకాలస్యం, డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం.అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుందని మీరు గుర్తుంచుకోండి.
అదేవిధంగా ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ డీల్ వర్తిస్తుంది.అవును, బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ కార్డు( EMI Card ) కలిగిన వారు మాత్రమే ఈ ఆఫర్లు పొందగలరు.
బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ద్వారా మీరు ఈ డీల్స్ సొంతం చేసుకోవచ్చు.కొనాలని భావించే వారు ముందుగా బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌లోకి వెళ్లి, బజాజ్ మాల్‌లోకి ఎంటర్ అవ్వాలి.
ఇప్పుడు అక్కడ మీకు బైక్స్, స్కూటర్లు కనిపిస్తాయి.

అక్కడ మీకు నచ్చిన మోడల్ ఎంచుకొని వాటి ధరను తెలుసుకోవచ్చు.ఉదాహరణకు హోండా షైన్ బైక్( Honda shine bike ) ఎంచుకుంటే.ధర రూ.1.03 లక్షలుగా ఉంటుంది.కాగా దానిని మీరు రూ.94,900కు కొనుగోలు చేయొచ్చు.అలాగే హోండా యాక్టివా ధర రూ.99,100 అయితే రూ.89,820కు కొనొచ్చు.ఇంకా సుజుకీ బర్గ్‌మాన్ ధర రూ.1.2 లక్షలకు అయితే రూ.1.04 లక్షలకు అందుబాటులో ఉంది.మీకు నచ్చిన మోడల్ ఎంచుకొని లోన్ టెన్యూర్ ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.ఇంకా వివరాలు కావాలంటే మీరు సంబంధిత షోరూమ్‌కు వెళ్లి కనుక్కోవచ్చు.