గొంతుకు అడ్డం పడి విలవిలలాడిన కస్టమర్.. పూర్వానుభవంతో కాపాడిన వెయిట్రెస్..

తింటున్నప్పుడు ఆహారం గొంతుకు అడ్డం పడి ఒక్కోసారి ఉక్కిరి బిక్కిరికి గురవుతాం.కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి.

 Waitress Save Life Of A Customer In Restaurant By Giving Anti Choke Treatment Vi-TeluguStop.com

ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి.ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అందుకే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు.తాజాగా ఇదే తరహాలో ఓ వ్యక్తి రెస్టారెంట్‌లో గబగబా తింటున్నాడు.

ఇంతలో అతడికి గొంతుకు ఆహారం అడ్డం పడింది.దీంతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం అయింది.

అయితే అప్పుడే ఓ వెయిట్రెస్ వచ్చి, అతడి పరిస్థితిని అర్ధం చేసుకుంది.ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాలిలా ఉన్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ అనే పేజీలో ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ అయింది.

ఆ వీడియోలో ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి టేబుల్‌పై కూర్చున్నట్లు కనిపిస్తుంది.అతడు ఆహారం తింటున్నప్పుడు అనుకోకుండా అది గొంతులో అడ్డం పడి ఇబ్బంది పడతాడు.

కొన్ని క్షణాలు ఉక్కిరిబిక్కిరి అవుతాడు.అతడి అవస్థను సమీపంలో ఓ వెయిట్రెస్ గమనిస్తుంది.

సర్వింగ్ చేసే ఆమె వెంటనే వారి దగ్గరకు వెళ్తుంది.అతడి సమస్యను అర్ధం చేసుకుంటుంది.

ఏ మాత్రం ఆలస్యం చేచకుండా అతడికి యాంటీ చోక్ ట్రీట్‌మెంట్ అందిస్తుంది.దాని వల్ల ఆహారం గొంతులో ఇరుక్కుంటే ఉపశమనం లభిస్తుంది.

ఆమె వెంటనే ఆ పని చేయడంతో ఆ కస్టమర్ ప్రాణాలు నిలిచాయి.ఇక వెయిట్రెస్‌గా చేస్తున్న ఆమెకు యాంటీ చోక్ ట్రీట్‌మెంట్ ఎలా తెలిసిందనే సందేహం చాలా మందికి వస్తుంది.ప్రస్తుతం వెయిట్రెస్‌గా పని చేస్తున్న ఆమె గతంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా పని చేస్తుంది.గతంలో ఆ పనిలో అనుభవాన్ని ఉపయోగించి, యాంటీ చోక్ ట్రీట్‌మెంట్ ఇచ్చి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది.

ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.క్షణాల్లోనే అప్రమత్తమై ఆమె ఆ కస్టమర్ ప్రాణాలు కాపాడిందని ప్రశంసిస్తున్నారు.మనం ప్రస్తుతం ఏ పని చేస్తున్నా, గతంలోని అనుభవం అక్కరకు వస్తుందని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube