ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి క్యాన్సర్.ఇంతగా మెడికల్ విభాగాల్లో అభివృద్ది జరిగినా, కొత్తగా ఎన్నో ఆవిష్కరణలు వచ్చినా కూడా క్యాన్సర్ బారిన పడ్డ వారిని కాపాడటంలో మాత్రం సఫలం అవ్వడం లేదు.
క్యాన్సర్ ఒకసారి ఎటాక్ అయితే అది ప్రాణాలు తీసే వరకు వదిలి పెట్టదని ఇప్పటికే పలు కేసుల ద్వారా వెళ్లడయ్యింది.పెరిగిన అభివృద్ది, ఇతరత్ర సాంకేతిక వనరుల కారణంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల మరణం ఆలస్యం చేయవచ్చు, కాని వారి మరణం మాత్రం ఆపడం అసాధ్యం అని వైధ్యులు కూడా అంటున్నారు.
ఇలాంటి సమయంలో అమెరికాకు చెందిన ప్రముఖ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అద్బుతమైన ప్రయోగాన్ని నిర్వహించి ఆసక్తికర విషయాలను వెళ్లడించారు.ఆ విషయం ప్రకారం క్యాన్సర్‌కు అద్బుతమైన ఔషదంగా సూర్యరశ్మి పని చేస్తుందని వారు అంటున్నారు.అందుకు వారు సాక్ష్యలను, ప్రత్యక్ష సాక్షులను కూడా చూపిస్తున్నారు.ఎంతో మంది సూర్యరశ్మి కారణంగా క్యాన్సర్ నుండి బయట పడటంతో పాటు, కొందరు క్యాన్సర్ రాకుండా కూడా చూసుకోగలిగారు అంటూ వారు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80000 మంది క్యాన్సర్ రోగులను శాస్త్రవేత్తలు నాలుగు సంవత్సరాల పాటు పరిశీలించిన తర్వాత నిర్ధారించిన విషయం ఏంటీ అంటే సూర్యరశ్మి ద్వారా వస్తున్న విటమిన్ డి కారణంగా క్యాన్సర్ మొదటి దశలో ఉన్న వారికి నయం అవుతుంది.మొత్తం క్యాన్సర్ రోగుల్లో విటమిన్ డి కారణంగా 14 శాతం మంది క్యూర్ అయినట్లుగా చెబుతున్నారు.మొత్తానికి చిన్న పిల్లలకే కాకుండా క్యాన్సర్ వ్యాదిగ్రస్తులకు కూడా సూర్యరశ్మి ద్వారా వచ్చే విటమిన్ డి చాలా కీలకంగా వారు చెబుతున్నారు.అందుకే ఉదయం 7 గంటల లోపు కనీసం 15 నుండి 25 నిమిషాల వరకు ఎండలో ఉంటే అన్ని విధాలుగా మంచిది.