తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు స్టార్ హీరోలందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.ఇక ఇప్పటికే తేజా సజ్జా( Teja Sajja ) పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు.
ఇక విశ్వక్ సేన్( Vishwak Sen ) లాంటి యంగ్ హీరో సైతం పాన్ ఇండియా మార్కెట్ మీద కన్ను వేసినట్టుగా తెలుస్తోంది.మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే వాళ్లకు పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే తేజ సజ్జ లాంటి యంగ్ హీరో హనుమాన్ సినిమాతో( Hanuman Movie ) పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టిన విషయం మనకు తెలిసిందే.ఇక దానికి తగ్గట్టుగానే తన తదుపరి సినిమాలతో కూడా భారీ వసూళ్లను రాబట్టాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్( Mirai ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా పాన్ ఇండియా( Pan India ) సబ్జెక్టుగా రావడంతో పాటుగా ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక విశ్వక్ సేన్ తెలుగు సినిమాలనే చేస్తున్నప్పటికకి తొందర్లో పాన్ ఇండియా సబ్జెక్టులను కూడా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక తను అనుకున్నట్టుగానే పాన్ ఇండియా సినిమాలతో మంచి విజయాన్ని సాధిస్తే తన మార్కెట్ కూడా భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు తనను తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మాత్రమే పనిచేశాయి.కాబట్టి ఇప్పుడు కలెక్షన్ల పరంగా చేసి భారీ వసూళ్లను సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఇక రీసెంట్ గా వచ్చిన మెకానిక్ రాఖి( Mechanic Rocky ) తో విశ్వక్ సేన్ అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.
దాంతో ఆయన కొంతవరకు వెనుకబడిపోయాడనే చెప్పాలి…